మోసపోయేవాడుంటే,మోసం చేసే వారు పుడుతూనే వుంటారు అని ఓ సినిమా డైలాగ్,ఈ డైలాగ్ రాసిన అతను నిజంగా మహానుభావుడే ఎందుకంటే ఓ వైపు మీడియా,మరోవైపు పోలీసులు,చెవులు చిల్లులు పడేలా ప్రచారం చేస్తూనే వున్నారు, ఎవరైన మీ పెట్టుబడిని డబుల్ చేస్తామనే బ్రోకర్ మాటలు నమ్మి మోసపోవద్దని.కాని ఈ జనం వింటున్నారా వినరు అందుకే మొదటిలైన్ డైలాగ్ సూపర్ అన్నది.దీనికంతటికి కారణం ఆశ,ఆ ఆశే మనసుని ఇలాంటివాటివైపు నడిపిస్తుంది. ఇలాంటి వాటిలో చేరేముందు పోలీసులు గుర్తుకురారు,నిండా మునిగాక లబోదిబోమంటు రక్షకభటుల దగ్గరికి పరిగెత్తుతారు.ఇప్పుడు విద్యార్థులే లక్ష్యంగా మరో గొలుసుకట్టు వ్యాపారం బజారుకొచ్చింది.




గొలుసుకట్టు విధానం ద్వారా ఇ-బిజ్‌ సంస్థ తమను మోసం చేసిందంటూ కేపీహెచ్‌బీ,మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు నమోదవడంతో పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.ఈ సంఘటనకు ముఖ్య దారులైన ఇ-బిజ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ మల్హాన్‌ (62),ఆయన కుమారుడు హితిక్‌ మల్హాన్‌(31) లను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఇ బిజ్‌ కంపెనీపేర బ్యాంకుల్లో ఉన్న రూ.389 కోట్ల నగదును సీజ్‌చేశారు.




అలాగే నోయిడాలో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా సీజ్‌ చేసినట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ విసి సజ్జనార్‌ తెలిపారు ఆయన కమిషనరేట్‌లో మీడియా తో మాట్లాడుతు దేశ వ్యాప్తంగా ఇ బిజ్‌ 17లక్షలకు పైగా ప్రతినిధులను నియమించుకుని, రూ.5వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడిందని వెల్లడించారు.ఢిల్లీ లో పవన్‌,హితిక్‌లను అరెస్టు చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చగా  నిందితు లను చర్లపల్లి జైలుకు తరలించమని ఆదేశించారని చెప్పారు.




ఇక నోయిడాలో ఇ బిజ్‌ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని 2001లో పవన్‌ మల్హాన్‌ ప్రారంభించారు.సంస్థ ప్రమోటర్లుగా విద్యార్థులు, నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు.తమ సంస్థకు చెందిన ఈ-లెర్నింగ్‌ ప్రాజెక్టుల్లో చేరితే సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రలోభపెడుతూ సభ్యుల్ని చేర్పించుకున్నారు. నెలలోనే పెట్టుబడి సొమ్ము సంపా దించవచ్చునంటూ ఆశ చూపారు.మరో ముగ్గుర్ని చేర్పిస్తే తప్ప డబ్బు రాదని మెలికపెట్టి కొత్త సభ్యుల్ని చేర్పించే పరిస్థితిని కల్పించారు.




అలా సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌, బెంగళూరు,చెన్నై,ఢిల్లీ నగరాలతోపాటు జమ్ముకశ్మీర్‌,ఉత్తర్‌ ప్రదేశ్‌,మహారాష్ట్ర, కర్ణాటక,తమిళనాడు,గోవా,తెలంగాణ రాష్ట్రాల్లో గొలుసుకట్టు మోసాన్ని కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. గొలుసుకట్టు వ్యాపారాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని ఈ సందర్భంగా మరోసారి గట్టిగా చెప్పారు.సులభంగా డబ్బు సంపాదన ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: