చైనా రోజురోజుకూ బలపడుతోందా.. ఆ చైనా సత్తా చూసి ఏకంగా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ సైతం బెదిరిపోతున్నాడా.. దీనికితోడు.. చైనా తప్పుడు మార్గాల్లో అభివృద్ధి చెందుతుని ఆందోళన చెందుతున్నాడా.. తాజాగా ఆయన డైలాగులు చూస్తే అలాగే అనిపిస్తోంది.


చైనా తన రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవటంపై డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఈ కమ్యూనిస్ట్ దేశం ప్రపంచానికి పెను ముప్పుగా మారుతోందని డైలాగులు కొడుతున్నాడు. అంతే కాదు.. చైనా రక్షణ సామర్థ్యాలను పెంచడానికి అమెరికా మేధో సంపత్తిని దొంగిలించకుండా ఆపలేకపోయారని తమ పాత ప్రెసిడెంటులను కూడా ట్రంప్ తిడుతున్నాడు.


తనకన్నా ముందు పనిచేసిన అధ్యక్షులు ఏడాదికి 500 బిలియన్ డాలర్లకు పైగా పన్నులను చైనా దోచుకునేందుకు అనుమతించారని ట్రంప్ నిప్పులు తొక్కుతున్నాడు. ఆ సొమ్ము తీసుకునేందుకు చైనాను అనుమతిస్తే.. దానిని సైనిక అవసరాలకు ఖర్చు చేస్తుందని ట్రంప్ అభ్యంతరం చెబుతున్నాడు.


దక్షిణ చైనా సముద్రంలో అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా బీజింగ్ తన సైనిక వ్యయాన్ని 7 శాతానికి పెంచుకుంది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు చైనాతో ఎలాంటి ఒప్పందం అవసరం లేదని ట్రంప్ చెబుతున్నారు. ఈ అంశంలో చైనాతో పూర్తి స్థాయి ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నట్లు ట్రంప్ చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: