ఫోర్బ్స్ జాబితాకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ప్రామాణికత ఉంది. ఈ జాబితాను బట్టే ప్రపంచంలోని కంపెనీలు ఓ అంచనాకు వస్తాయి. అలాంటి ఫోర్బ్స్ జాబితాలో మన ఇండియన్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చరిత్ర సృష్టించింది. అత్యంత గౌరవనీయ కంపెనీల జాబితాలో ఏకంగా మూడో స్థానం దక్కించుకుంది.


ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన అత్యంత గౌరవనీయ కంపెనీల జాబితాలో భారత్ కు చెందిన 17 కంపెనీ చోటు దక్కించుకున్నాయి. బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఉన్న ఇన్ఫోసిస్ ఈ జాబితాలో మూడో స్థానం సాధించింది. గతేడాది ఇన్ఫోసిస్ ది 31వ ర్యాంకు. ఈసారి ఏకంగా ఇన్ని స్థానాలు ఎగబాకడం నిజంగా సంచలనమే.


మరి ఇంతకీ ఫస్ట్ ప్లేస్ ఎవరిది అంటారా.. గ్లోబల్ చెల్లింపుల సంస్థ వీసా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇటలీకి చెందిన ప్రముఖ కార్ల సంస్థ ఫెరారీ రెండో స్థానంలో నిలిచింది.ఇక భారత్ నుంచి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న కంపెనీల వివరాలు ఇవీ.. భారత్ నుంచి టీసీఎస్ 22, టాటా మోటార్స్ 31వ ర్యాంకుల్లో నిలిచాయి. టాటా స్టీల్ 105, ఎల్ అండ్ టీ 115, మహీంద్ర అండ్ మహీంద్ర 117, హెచ్ డీఎఫ్ సీ 135 వ స్థానంలో నిలిచాయి.


ఇవి కాకుండా మొదటి 250 స్థానాల్లో నిలిచిన ఇండియన్ కంపెనీలు ఇవీ.. బజాజ్ ఫిన్ సర్వ్ , పిరమాల్ ఎంటర్ ప్రైజెస్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, విప్రో, , సన్ ఫార్మా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్.. మొదలైనవి ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: