ప్రముఖ దేశీ వాహన తయారీ కంపెనీ  అయిన టాటా మోటార్స్‌ తన టిగోర్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ లో అధునాతన వెర్షన్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది .ఇదివరకటి  వెర్షన్ కంటే  ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుందని  వెల్లడించారు. మొన్నటి వరకు టాటా మోటార్స్ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ వాహనాల్ని కేవలం క్యాబ్ నిర్వాహకులకు,ప్రభుత్వ సంస్థలకు మాత్రమే విక్రయాలు చేసేవాళ్ళు.ఇప్పటి నుండివ్యక్తిగత  వినియోగదారులు కూడా ఈ వాహనాల్ని కొనుగోలు చేసుకోవచ్చు అని  టాటా సంస్థ వాళ్ళు తెలిపారు.

 

ఈ నూతన ఎలక్ట్రిక్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ కారులో 21.5 కిలోవాట్‌ అవర్‌ (కేడబ్ల్యూహెచ్‌) బ్యాటరీని  అమర్చారు . దీంతో ఒక్కసారి చార్జింగ్‌తో  213 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ప్రకటించారు. ఇది గతం లో కంటే ఎక్స్ట్రా కిలోమీటర్లు  అదనంగా వస్తుంది అని పేర్కొన్నారు. ఎక్స్‌ఈ ప్లస్, ఎక్స్‌ఎం ప్లస్, ఎక్స్‌టీ ప్లస్‌ పేర్లతో మొత్తం మూడు వేరియంట్లలో ఈ నూతన కారు అందుబాటులోకి తీసుకువచ్చారు.ఇందులో రెండు ఛార్జింగ్ పోర్టులు కూడా లభ్యం కానున్నాయి.ఒకటి స్లో ఛార్జింగ్ కి మరొకటి ఫాస్ట్ ఛార్జింగ్ కోసం వినియోగించవచ్చు అని కంపెనీ వాళ్ళు వివరించారు. 

 

అదనంగా ఎక్స్‌ఈ ప్లస్ వెర్షన్ లో రెండు ఎయిర్ బాగ్స్ ని ఇచ్చారని చెప్పారు.అన్ని వేరియంట్లలో సేఫ్టీ  ఫీచర్స్ తో పాటు  అదనంగా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం ఇచ్చారని తెలిపారు. వీటితో పాటు స్టైలిష్ అల్లాయ్ వీల్స్,హైట్ అడ్జస్ట్ చేసుకునేలా సీట్ ,ప్రీమియం ఫ్రంట్ గ్రిల్,అర్మాన్ సౌండ్ సిస్టం,సిగ్నేచర్ ఈవి డెకల్స్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ తో కను విందు చేయనున్నాయి  అని తెలిపారు టాటా సంస్థ . ప్రభుత్వ రాయితీల తీసేయగా  ఈ కారు ప్రారంభ ధర రూ. 9.44 లక్షలని టాటా మోటార్స్ సంస్థ  ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: