కస్టమర్స్ పెరిగేదాక మా నెట్వర్క్‌లో అవి ఫ్రీ, ఇవి ఫ్రీ అంటూ ఆఫర్లతో టెలికాం కంపెనీలు అదరగొడతాయి. వినియోగ దారులంతా ఆ నెట్వర్క్‌కు మారి వారి బిజినెస్ విజయవంతగా ముందుకు నడిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా చార్జీలంటూ అదనపు భారాన్ని మోపి టెలికాం సంస్దలు నడ్డివిరుస్తాయి. ఇప్పుడు జియో కూడా ఇలానే చేసింది.


ఈ జియో సిమ్ వచ్చినప్పటి నుండి దాదాపు చాల మందికి ఇంటర్నెట్ ఓ ప్రపంచంగా మారింది. ఎవ్వరు చూడు జియో,ఎక్కడ చూడు జియో అంటు జపం మొదలెట్టారు. ఇంతలా ప్రజలను ప్రభావితం చేసిన ఈ కంపెనీ ఊహించని షాక్‌ను తమ కస్టమర్లకు ఇచ్చింది.ఇప్పుడు దీనికి ధీటుగా వొడాఫోన్ ఐడియా మాత్రం తమ కస్టమర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. ఇతర టెలికం ఆపరేటర్స్‌ కు కాల్ చేస్తే జియో తమ కస్టమర్ల నుంచి నిమిషానికి 6 పైసల్ ఛార్జ్ చేస్తోంది.


దీని కోసం కొత్త ఐయూసీ ప్లాన్‌ను తీసుకు వచ్చింది. ఈ టాపప్ కార్డ్స్ వేసుకుంటే ఉచిత డేటా ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జియోపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వొడాఫోన్ ఐడియా మాత్రం శుభవార్త చెప్పింది. ఇతర నెట్‌వర్క్స్‌కు వాయిస్ కాల్ చేస్తే తాము ఎలాంటి ఐయూసీ ఛార్జీలు వసూలు చేయమని స్పష్టం చేసింది. ఈ ఐయూసీ ఛార్జీలు అనేవి మొబైల్ కంపెనీలు తమలో తాము తేల్చుకోవాల్సిన అంశమని, వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదని వోడాఫోన్ ఐడియా పేర్కొంది.


అంతేకాదు,  జియో ఐయూసీ  ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటించడం తొందరపాటు చర్య అని పేర్కొంది. ఇక తమ కస్టమర్లు చేసే ప్రతి కాల్‌కు ఛార్జీలు పడతాయా లేక ఉచిత కాల్స్ చేస్తున్నామా అని అయోమయానికి గురికావాల్సిన అవసరం లేకుండా చేయడమే తమ ఉద్దేశమని తెలిపింది. ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ చేసే కాల్స్‌ ఏ నెట్ వర్క్‌కు వెళ్లినా ఉచితమేనని తెలిపింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సేవలను అందించడం తమకు లాభదాయకం కాకపోయినా సేవలను కొనసాగిస్తున్నామని వొడాఫోన్‌ ఐడియా టెలికాం అధికారులు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: