ఇతర టెలికం ఆపరేటర్లకు చేసే ఫోన్ కాల్ పైన నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నట్లు రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై జియో యూజర్లు ఆసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ ఛార్జ్ వసూలు చేసినప్పటికీ ఆ మొత్తానికి గాను డేటా ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. కానీ ఇది కస్టమర్లకు అంతగా నచ్చలేదు. మరోవైపు, వొడాఫోన్ ఐడియా మాత్రం తాము తమ కస్టమర్లకు ఎలాంటి ఐయూసీ ఛార్జ్ విధించమని స్పష్టం చేసింది.

ఇతర నెట్ వర్క్స్‌కు చేసే వాయిస్ కాల్స్‌పై ఛార్జ్ వసూలు చేస్తామని చెప్పిన జియో తాజాగా కస్టమర్లకు శుభవార్త చెప్పింది!  30 నిమిషాల పాటు ఉచిత టాక్ టైమ్ 30 నిమిషాలపాటు ఉచిత టాక్ టైమ్ ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. నిమిషానికి 6 పైసలు ప్రకటన జియోకు నష్టం చేకూర్చేలా ఉంది. ఇలా ఛార్జ్ విధించడం ద్వారా మిగతా నెట్ వర్క్ కస్టమర్లను కూడా తనవైపు తిప్పుకోవాలనే సహా ఎన్నో యోచనలు ఉండి ఉండవచ్చు.అయితే ఆ ప్రకటన తర్వాత రెండు రోజుల్లో అరగంట ఫ్రీ అనే శుభవార్త తెలిపింది.

వారం రోజుల పాటు అందుబాటులో ఆఫర్ ఇది (30 నిమిషాల ఉచిత టాక్ టైమ్) ఫస్ట్ టైమ్ రీఛార్జ్ చేయించుకున్న కస్టమర్లకు వర్తిస్తుంది. అలాగే, రీచార్జ్ ప్లాన్స్ ప్రకటించిన తొలి వారం రోజులు ఈ వన్ టైమ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కస్టమర్లను కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఆఫర్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే జియో వైపు కూడా కస్టమర్లు సులువుగా వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.

రిలయన్స్ జియో... ఇతర నెట్ వర్క్ ఆపరేటర్లకు కాల్ చేస్తే జియో నిమిషానికి 6 పైసలు ఛార్జ్ చేస్తోంది. అయితే కస్టమర్లు తగ్గకుండా ఆఫర్ చేస్తున్న కొన్ని సంక్షిప్తంగా.... - మొదటి రీచార్జ్ పైన 30 నిమిషాల ఉచిత టాక్ టైమ్ - ఈ వన్ టైమ్ ఆఫర్ అక్టోబర్ 10 నుంచి ప్రారంభం. ఇది ఏడు రోజుల వరకు ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: