కింగ్‌కోఠి ప్యాలెస్‌లోని ప్రధాన భవనం అయిన పరదాగేట్‌ ఇప్పటికీ ప్రసిద్ధే. ఈ భవనం ఇప్పటికీ పరదా వేసి ఉంచడం విశేషం. అప్పట్లో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ నివాస కేంద్రంగా ఉన్న ఈ భవంతిలో, ఆయన ఉన్నప్పుడే  పరదాని పైకి లేపి ఉంచేవారుట. లేని యెడల పరదా కిందకు వేసి ఉండేదని, అప్పుడు ఆయన రాజ్య పర్యటనలో ఉన్నారని ప్రజలు భావించేవారు.

నిజాం రాజు నిత్యం వెళ్లే దారిని నీళ్లతో కడిగి శుద్ధి చేసేవారు. ఇక్కడ నిత్యం  పోలీస్‌ బలగాలతో భారీ కాపలా ఉండేది. నిజాం నవాబు ఉస్మాన్‌ అలీఖాన్‌ ఈ భవనంలోనే తుది శ్వాస విడువగా ఆయన సమాధి సైతం ఈ పరిసరాల్లోనే (జుడీ మస్జీద్‌) ఉండటం ఇంకో విశేషం. ఇప్పుడు నిజాం చరిత్ర వైభవానికి ఆనవాలుగా ఉన్న పరదాగేట్‌  ఇక కనుమరుగుకానుంది.

చారిత్రక వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ ప్యాలెస్‌ కనుమరుగుకానుందన్న వాస్తవం చరిత్ర ప్రేమికులు జీర్ణించుకోటం కష్టమే ఇక. ఈ భవనం నిజాం రాజులనాటి చారిత్రక వైభవానికి కింగ్‌కోఠి ప్యాలెస్‌ శిథిలమవడమే సజీవ సాక్ష్యం. 70 ఏళ్లుగా నిజాం వారసుల చేతుల్లో ఉన్న ఈ భారీ భవనం యాజమాన్య హక్కులు గతంలోనే చేతులు మారాయి. ఢిల్లీకి చెందిన ప్రముఖ హోటల్స్‌ సంస్థ ఐరిస్‌ రూ.150 కోట్లకు ఈ భారీభవంతిని కొనుగోలు చేసారు.

ప్రస్తుతం ఐదెకరాల విస్తీర్ణంలో కింగ్‌కోఠి ప్యాలెస్‌లో ఉన్న మూడు భవనాల్లో ఒకదాన్లో ఈఎన్‌టీ ఆస్పత్రి నడుపుతున్నారు, మరో భవనంలో నిజాంట్రస్ట్‌ కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ భవనాన్ని కూల్చి అతి పెద్ద విలాసవంతమయిన  బిజినెస్‌ మాల్‌ను నిర్మించేందుకు ఐరిస్‌ సంస్థ సన్నాహాలు ప్రారంభించారు. ఈ పరదాగేట్‌ను కొన్న ముంబైవాలా, 5000 గజాల విస్తీర్ణంలో రూ. 150 కోట్ల వ్యయంతో కింగ్‌కోటి ప్యాలెస్‌ ఇప్పుడు ఐరిస్‌ బిజినెస్‌ మాల్స్‌గా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: