ఆర్థిక మందగమనం ఉన్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ పిఎఫ్ ఖాతాదారులకు ఒక శుభవార్త ఇచ్చింది 2018 -19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పిఎఫ్ ఖాతాదారులకు జమ అయిన మొత్తం మీద 8.65 శాతం వడ్డీని జమ చేసింది ఈ వడ్డీ జమ అయినట్లు ఖాతాదారులకు ఎస్ఎంఎస్ లు వస్తున్నాయి


ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటు పెంపునకు కేంద్రం ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ పెంపుతో దాదాపు 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరింది. వాస్తవానికి ఈ వడ్డీ గత ఫిబ్రవరిలోనే జమ కావాల్సి ఉంది.

కానీ, కేంద్ర ఆర్థిక శాఖ దీనికి ఆలస్యంగా ఆమోదం తెలపడంతో ప్రస్తుతం ఆ మొత్తం జమ అవుతోంది. అయితే, ఆలస్యం వల్ల ఖాతాదారులకు ఎలాంటి అదనపు మొత్తం అందబోదు. ఇదిలా ఉండగా, పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను ఎలా తెలుసుకోవడానికి UMANG యాప్, SMS, EPF పోర్టల్ లేదా Missed Call ద్వారా పీఎఫ్ అకౌంట్లలో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు.వీటి వివరాలు కింద తెలియ చేస్తున్నాము 


1 .మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ నుంచి  EPFOHO UAN టైప్ చేసి  77382 99899కు ఎస్సెమ్మెస్ చేయాలి.
2 . UMANG యాప్ ఓపెన్ చేసి మీ UAN అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.మీ పీఎఫ్ బ్యాలెన్స్‌కు సంబంధించి వివరాలను తెలుసుకోవచ్చు.
3 .EPF పోర్టల్లో అవర్ సర్వీసెస్ కింద ‘ఫర్ ఎంప్లాయీస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.మీ యూఏఎన్ యూజర్ పేరు, పాస్‌వర్డ్ తో లాగిన్ కావాలి.ఈపీఎఫ్ పాస్‌బుక్ స్ర్కీన్ ఓపెన్ చేయగానే బ్యాలెన్స్ కనిపిస్తుంది.
4 . రిజిస్టర్ మొబైల్ నుంచి 011-22901406కు మిస్ కాల్ ఇస్తే బాలన్స్ తెలుస్తుంది 


మరింత సమాచారం తెలుసుకోండి: