ఇన్ఫోసిస్ అకౌంటింగ్ దుర్వినియోగం యొక్క ప్రజావేగు ఆరోపణలపై స్వతంత్రంగా దర్యాప్తు చేయడానికి న్యాయ సంస్థ షార్దుల్ అమర్‌చంద్ మంగల్‌దాస్‌ను నియమించింది, పెట్టుబడిదారులు మంగళవారం స్టాక్‌ను డంప్ చేసినప్పటికీ, ఇది 16.65% పడిపోయి - ఆరు సంవత్సరాలలో పదునైన ఒకే రోజు నష్టం నెలకొలిపి  రూ.3,000,000 కోట్లు మార్కెట్‌ వేల్యుయేషన్‌ ని  కోలిపోయింది .

దర్యాప్తుకు స్వతంత్రం  లభించేలా సీఈఓ సలీల్ పరేఖ్, సిఎఫ్‌ఓ నీలంజన్ రాయ్‌లను ఈ విషయం నుంచి ఉపసంహరించుకున్నట్లు ఇన్ఫోసిస్ నాన్  ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని రెగ్యులేటర్లకు ఒక ప్రకటనలో తెలిపారు.సంస్థలో అనైతిక విధానాల పేరిట ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న ఒక బోర్డు సభ్యుడికి గుర్తుతెలియని వారి నుంచి రెండు ఫిర్యాదులు వచ్చినట్లు నీలేకని తెలిపారు. వీటిలో ఒక దానిపై సెప్టెంబర్‌ 20వ తేదీ ఉండగా, రెండో దానిపై తేదీ లేకుండా ప్రజావేగు ఫిర్యాదు అని ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ రెండింటినీ అక్టోబర్‌ 10న ఆడిట్‌ కమిటీ ముందు, మరుసటి రోజున బోర్డులో నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ సభ్యుల ముందు ఉంచినట్లు నీలేకని తెలిపారు. తేదీ లేని రెండో లేఖలో ప్రజావేగు ప్రధానంగా సీఈవో అమెరికా, ముంబైల పర్యటనల మీద ఆరోపణలు ఉన్నట్లు వివరించారు. కంపెనీ లాభాలు పెంచి చూపించేందుకు సలిల్‌ పరేఖ్, ఆయనకు తోడుగా నీలాంజన్‌ రాయ్‌ ఖాతాలు గోల్‌మాల్‌ చేయిస్తున్నారంటూ కొందరు ఉద్యోగుల బృందం.. ఇన్ఫీ బోర్డుకు, అమెరికాలోని విజిల్‌బ్లోయర్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రాంకు చేసిన ఫిర్యాదులు సోమవారం వెలుగులోకి వచ్చాయి.

గత రెండు త్రైమాసికాలుగా ఇలాంటి ధోరణులు పెరిగాయని, అనైతిక విధానాలకు అడ్డు చెప్పిన ఉద్యోగులను పక్కన పెట్టడం జరుగుతోందని ప్రజావేగులు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఈమెయిల్స్, వాయిస్‌ రికార్డింగ్స్‌ అన్నీ తమ దగ్గర ఉన్నాయని, తగిన సందర్భంలో అందజేస్తామని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: