స్టాక్ మార్కెట్ గురించి ఏమి తెలియకుండా కంపెనీల షేర్లు కొనుగోలు చేయడం అనేది ఈత రాకుండా నూతిలో దూకడం లాంటిది. ఈత రాకపోతే మనిషి ఎలా గిలగిల కొట్టుకుంటాడో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన తరువాత మార్కెట్ ఒడిదుడుకులకు  లోను అయినప్పుడు మన పరిస్థితి కూడా ఈత రాని  లాగే ఉంటుంది. అందుకే ముందు రకరకాల వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, విశ్వసనీయ వెబ్ సైట్ల ద్వారా మొదట స్టాక్ మార్కెట్ల గురించి అవగాహన తెచ్చుకోవాలి.

స్టాక్ అనేది ఒక కంపెనీకి సంబంధించిన వాటాలు లో ఒక భాగము అని మరియు ఒక నిష్పత్తి ప్రకారం ఆ కంపెనీ లాభనష్టాలు లో కూడా వాటా కలిగి ఉంటాము అని అర్థమవుతుంది. పెట్టుబడి రంగాల్లో స్టాక్ మార్కెట్, బంగారము రియల్ ఎస్టేట్ దేనిలోనైనా సరే ఒకే రంగంలో ఎక్కువ మొత్తం ఉంచకూడదు.


  ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. అయితే ప్రభుత్వరంగ షేర్లలో కొనుగోళ్లు జోరు శుక్రవారము రోజు మార్కెట్ కు అదృష్టం కలిసొచ్చింది . సెన్సెక్స్ 38 పాయింట్లు పైకి జరిగింది అలాగే 11600 దిగువనే ఉండిపోయినది కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు పరుగులు పెట్టింది దీనివలన ఎస్బిఐ లో షేర్లుపెట్టిన వాళ్లకు దీపావళి పండగ  నిజమైన పండుగ.

బలమైన క్యూ టు ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బ్యాంకు షేరు దాదాపు ఎనిమిది శాతం ర్యాలీ చేసింది. రెండు వందల ఎనభై రెండు రూపాయల వద్ద ముగిసింది. అలాగే వెండి ధర భారీగా పడిపోయింది. మరియు నిఫ్టీ 50 లో ఎస్ బ్యాంకు ,ఎస్బిఐ , ఐ సి ఐ సి ఐ బ్యాంకు ,సిప్లా, సన్ ఫార్మా,షేర్లు టాప్ క్లీనర్లు గా ఉన్నాయి ఎస్ బ్యాంకు 11 శాతానికి పైగా పరుగులు పెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: