2017 లో సెప్టెంబర్ 5వ తేదీన  జియో ని  ప్రకటించి సంచలనానికి తెరలేపారు ముఖేష్ అంబానీ గారు అప్పటివరకు ఒక జీబి కి  కూడా 300 ఖర్చు చేసిన రోజులు ఉన్నాయి కానీ జియో వచ్చిన తర్వాత రోజుకు వన్ జిబి నెల  మొత్తానికి కలిపి రెండు వందలు  రూపాయలు ఇచ్చిన మహానుభావుడు అంబానీ గారు .


అలానే ఇప్పుడు  దీపావళికి కి కూడా మరో బంపర్ ఆఫర్ ప్రజలందరికి ప్రకటించాడు. రూ.699 ధరకే జియో ఫోన్ కొనొచ్చు. ఇది లిమిటెడ్ టైమ్ దివాళీ ఫెస్టివల్ ఆఫర్. రూ.1500 విలువైన జియో ఫోన్ రూ.699 ధరకే సొంతం చేసుకోవచ్చు.. దీపావళి పండుగ సీజన్ సందర్భంగా 'జియో ఫోన్ దీపావళి 2019' పేరుతో ప్రత్యేకమైన ఆఫర్ అందిస్తోంది. రూ.1500 విలువైన జియోఫోన్‌ను కేవలం రూ.699 ధరకే అందిస్తోంది.


ప్రస్తుతం 2జీ సేవలు పొందుతున్నవారంతా కేవలం రూ.699 చెల్లించడం ద్వారా 4జీ ప్రపంచంలోకి అడుగుపెట్టొచ్చు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యలుు ఇప్పటికీ ఫీచర్ ఫోన్ వాడుతున్నట్టైతే రూ.699 విలువైన ఫోన్ గిఫ్ట్‌గా అందించి 4జీ ప్రపంచంలోకి ఆహ్వానించొచ్చు.రూ.1500 విలువైన జియోఫోన్‌ను రూ.699 ధరకే సొంతం చేసుకోవడం ద్వారా రూ.800 పొదుపు చేసుకునే అవకాశం కల్పిస్తోంది రిలయెన్స్ జియో. పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయాలన్న షరతులేవీ లేవు.జియో ఫోన్‌ను రూ.699 ధరకు కొనడం మాత్రమే కాదు... బండిల్ ప్లాన్స్ కూడా ఎంచుకోవచ్చు. మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా బండిల్ ప్లాన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చుమీరు రూ.808 చెల్లించి జియో ఫోన్‌తో పాటు ఒక నెల రీఛార్జ్ పొందొచ్చు.


రూ.1006 చెల్లిస్తే జియోఫోన్‌తో పాటు మూడు నెలల రీఛార్జ్ లభిస్తుంది. రూ.1501 చెల్లిస్తే జియోఫోన్+8 నెలల రీఛార్జ్, రూ.1996 చెల్లిస్తే జియోఫోన్+13 నెలల రీఛార్జ్ లభిస్తుంది..రిలయెన్స్ జియో వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'Gift Now' ఆప్షన్ పైన క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయాలి. బండిల్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసి గిఫ్ట్ ఓచర్ పొందాలి. గిఫ్ట్ ఓచర్‌ను భారతదేశంలోని ఏ రిలయెన్స్ జియో స్టోర్‌లో అయినా రీడీమ్ చేయొచ్చు. జియో ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లున్నాయి. 2.4 అంగుళాల డిస్‌ప్లే, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫేస్‌బుక్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ లాంటి యాప్స్ వాడుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: