ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఏ ధరలు తగ్గుతాయి.. ఏవి పెరుగుతాయో అసలు తెలుసుకోలేకపోతున్నాం. ఒకసారి వెండి ధర బాగా తగ్గుతే ఒకసారి బంగారం ధర బాగా తగ్గుతుంది. ఒకేసారి రెండు తగ్గిన రోజులు చాల అరుదుగా చూస్తుంటాం. ఈ నేపథ్యంలోనే బంగారం ధర భారీగా పెరిగి వెండి ధర మరింత పతనం అయ్యింది. 


ఇంకా వివరాల్లోకి వెళ్తే.. నేడు బంగారం ధర భారీగా పెరిగి వెండి ధర భారీగా తగ్గింది. గత రెండు రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.310 పెరుగుదలతో రూ.40,410కు చేరింది.


అంతర్జాతీయంగా  బంగారానికి దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి భారీగా డిమాండ్ పెరగడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.310 పెరుగుదలతో రూ.37,050కు చేరింది. 


అయితే పసిడి ధర భారీగా పెరిగితే.. వెండి ధర మాత్రం వెనకడుగు వేసింది. దీంతో కేజీ వెండి ధర రూ.39,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతోనే వెండి ధర భారీగా పడిపోయింది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి పసిడి ప్రేమికులు ఎప్పుడు ఆనందిస్తారు అనేది  చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: