దేశం లోనే  అతిపెద్ద బ్యాంక్  అన్ని రాష్టాల్లోనూ బ్రాంచ్ లు కలిగి ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లను గట్టిగానే హెచ్చరిస్తోంది. మోసగాళ్ల వలలో పడొద్దని సూచిస్తోంది. లేదంటే బాగా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొంటోంది. దీనికి సంబంధించి బ్యాంక్ ఇప్పటికే తన ఖాతాదారులకు ఎస్ఎంఎస్ రూపంలో అలర్ట్‌లను పంపించి ఖాతాదారులను హెచ్చరిస్తుంది.

అకౌంట్ రద్దయ్యిందని ఎస్ఎంఎస్‌లు పంపి ఇందులో లింక్‌పై క్లిక్ చేసి అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలంటూ కేటుగాళ్లు  మోసం చేస్తున్నారు అని తెలిపింది .స్మార్ట్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చే లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచిస్తోంది.‘మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ రద్దయ్యింది.ఈ లింక్‌పై క్లిక్ చేసి మళ్లీ అకౌంట్‌ను రీయాక్టివేట్ చేసుకోండి’ అంటూ మోసగాళ్లు ఎస్ఎంఎస్‌లు పంపిస్తారని వివరించింది. లింక్‌పై క్లిక్ చేస్తే అకౌంట్‌దారుల వివరాలన్నీ మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయని హెచ్చరించింది.




పై ఫోటోలో పేర్కొన్న విధంగా మీకు ఎస్ఎంఎస్ రావొచ్చని ఎస్‌బీఐ తెలిపింది. వీటితో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అలాంటి సందర్భాల్లో ఆ లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచించింది. వ్యక్తిగత, అకౌంట్ వివరాలను ఎవ్వరికీ షేర్ చేయవద్దని తెలిపింది.కేవలం బ్యాంకుకు వెళ్లి మాత్రమే అకౌంట్ స్టేటస్‌ను తెలుసుకోవాలని సూచించింది. ఇలాంటి మెసేజ్‌లు వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని పేర్కొంది. ఎస్‌బీఐ ఎప్పటికీ కస్టమర్ల వివరాలను సేకరించదని స్పష్టం చేసింది


ఇకపోతే స్టేట్ బ్యాంక్ తన రిటైల్ సేవింగ్స్ అకౌంట్స్‌పై వడ్డీ రేట్లను తగ్గించింది. వ్యవస్థలో సరిపడినంత లిక్విడిటీ ఉందని, అందుకే వడ్డీ రేట్లు తగ్గిస్తున్నామని ప్రకటించింది. రూ.లక్ష వరకు బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లపై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గుతుంది. ఇప్పుడు ఈ అకౌంట్లపై 3.5 శాతం కాకుండా 3.25 శాతం వడ్డీ లభిస్తుంది


మరింత సమాచారం తెలుసుకోండి: