అమెజాన్‌ అంటే గుర్తుకు వచ్చేది. అది అతిపెద్ద ఆన్లైన్ దిగ్గజ సంస్థ. ఆన్లైన్ షాపింగ్ అన్నాక కొన్ని కొన్ని సార్లు వినియోగదారులు నష్టపోతుంటారు. కానీ ఈ సరి కూడా వినియోగదారులు భారీగా మరోసారి మోసపోయారు. గతంలో చిప్స్‌ ప్యాకెట్లలో తక్కువ చిప్స్‌ ఉంచి, గాలి నిండుగా నింపి వినియోగదారులను మోసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డాబర్‌ కంపెనీ కూడా ఇలాంటి మోసానికే పాల్పడింది. అమెజాన్‌ ద్వారా డాబర్‌ కంపెనీ విక్రయించిన క్యాండీ ప్యాకెట్లలో రెండు ఫ్లేవర్లు సమానంగా లేవు. 
దీంతో  వినియోగదారులు అసహనం (అసహనం) వ్యక్తం చేశారు. డాబర్‌ కంపెనీపై సోషల్ మీడియాలో విమర్శల జల్లు కురిపించారు. ఇంతకీ ఏం జరిగింది... కస్టమర్లు హజ్‌మోలా చాక్లెట్‌ ప్యాకెట్‌ను ఆర్డర్‌ చేశారు. ఇందులో రెండు రకాల క్యాండీలు సమానంగా ఉన్నాయని అర్థం వచ్చేలా ప్యాకెట్‌ డిజైన్‌ చేసి ఉంది. కానీ తీరా.. చూస్తే గ్రీన్‌ క్యాండీస్‌(అల్బెలా ఆమ్‌) తక్కువగా, రెడ్‌ క్యాండీస్‌(చుల్‌బులి ఇమ్లీ ఫ్లేవర్‌) సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆర్డర్ చేసిన వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
క్యాండీల లెక్క సమానంగా లేకపోవటంతో కస్టమర్లు వారి నిరుత్సాహాన్ని రివ్యూల ద్వారా వెల్లగక్కారు. అక్షయ్‌ అనే అమెజాన్‌ యూజర్‌ మాట్లాడుతూ..  నేను క్యాండీస్‌ను ఇప్పటికి మూడునాలుగు సార్లు కొనుగోలు చేశాను. ఈ ప్యాకెట్‌లో మొత్తంగా 125 వస్తే గ్రీన్‌ క్యాండీలు మాత్రం పదే ఉన్నాయి. అందులో గ్రీన్‌ క్యాండీ (ఆమ్‌) కాస్తంత తీపిగా ఉందంతే. 
ఇక మిగతా క్యాండీలు చాలా పుల్లగా ఉన్నాయని పేర్కొన్నాడు. తీపిని ఇష్టపడేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఆర్డర్‌ చేయడం మంచిదని సూచించాడు ఆ యూజర్. మిగతా కస్టమర్లు సైతం ఇంత తక్కువగా గ్రీన్‌ క్యాండీలు ఇచ్చారేంటని డాబర్‌పై మండిపడుతున్నారు. ఇక వీరి చాక్లెట్ల గోలపై ట్విటర్‌లో ఫన్నీ మీమ్స్‌ వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: