దేశంలో  ప్రైవేట్ రంగంలో పెద్ద బ్యాంకు గా  గుర్తింపు పొందిన  బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. వివిధ కాలపరిమితుల్లోని రుణాలపై మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను తగ్గించింది. 10 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గింపు నేపథ్యంలో బ్యాంక్ అందించే రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి.

బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. 6 నెలల కాలపరిమితిలోని రుణాలపై ఎంసీఎల్ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఈ రేటు 8.1 శాతానికి దిగొచ్చింది. ఏడాది ఎంసీఎల్ఆర్ కూడా 5 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీంతో ఇప్పుడు ఈ రేటు 8.3 శాతంగా ఉంది.బ్యాంక్ అలాగే రెండేళ్ల కాలపరిమితిలోని రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఈ రేటు ఇప్పుడు 8.4 శాతానికి దిగొచ్చింది. దీంతో ఎంసీఎల్ఆర్ 8.5 శాతానికి దిగొచ్చింది.

ఈ కొత్త రేట్లు నవంబర్ 7 నుంచే అమలులోకి వచ్చాయి.ఇకపోతే బ్యాంక్ ఓవర్‌నైట్, నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చివరిగా ఆగస్ట్ నెలలో ఎంసీఎల్ఆర్ రేటులో కోత విధించింది. అప్పుడు కూడా బ్యాంక్ ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది.రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా  కీలక రేపో రేట్ ను తగ్గిస్తూ రావడంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లలో కోత విధిస్తున్నాయి. ఆర్‌బీఐ ఈ ఏడాది ఇప్పటి దాకా రెపో రేటును 135 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.

రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు వేగంగా బదిలీ చేసేందుకు ఎంసీఎల్ఆర్ నుంచి ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ విధానానికి మారాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: