మీరు రైల్వే ప్రయాణం ఎక్కువగా చేస్తుంటారా? అయితే ట్రైన్ టికెట్ బుకింగ్ సమయంలో మీకీ చాల  సమస్యలు ఎదురు అయ్యాయా. కొన్ని సందర్భాల్లో పేమెంట్ ఫెయిల్ సమస్య కూడా ఎదురుకున్నారా. లేదంటే పేమెంట్‌ చేయడానికి చాల సమయం తీసుకుంటుందా... ఈ లోపు  టికెట్లు వేరెవరికో బుక్ అయిపోతాయి. రైల్వే టికెట్ బుకింగ్ చేసుకోవడం అంటే ఒత్తిడితో కూడుకున్న విషయం అని అందరికి తెలిసిందే కదా. పేమెంట్స్ చాలా టైమ్ తీసుకుంటాయి. మీ ఫోన్‌లో పేమెంట్ గేట్‌వే ఓపెన్ అయ్యేసరికి టికెట్లు అప్పటికే వేరొకరికి బుక్ అయిపోయి అవకాశాలు కూడా ఉన్నాయి. టికెట్ బుకింగ్ ప్రత్యేకింగి తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో పేమెంట్ వేగంగా జరిగిపోతే టికెట్ కన్ఫార్మ్ అయ్యేందుకు ఛాన్స్‌లు ఎక్కువగా లభిస్తాయి.


ఇక్కడ ఐఆర్‌సీటీసీ ఐముద్రా పేమెంట్ వాలెట్‌తో టికెట్ బుకింగ్ పేమెంట్‌ను సులువుగా చేసుకోవచ్చు. ట్రైన్ టికెట్ బుకింగ్‌తోపాటు ఆన్‌లైన్ షాపింగ్ కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది. స్నేహితులకు, ఇతరులకు డబ్బులు కూడా పంపే సదుపాయం కూడా ఉంది. ఈజీ ఓటీపీ ఫీచర్‌తో ట్రైన్ టికెట్లను సులభంగానే టికెట్ బుక్ చేసుకోవచ్చు. కేవలం 4 స్టెపుల్లో పేమెంట్ పూర్తి చేసుకోవచ్చు సులువుగా. 


ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఐముద్రా ఓటీపీ ఫీచర్‌తో ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకోండి ఇలా.. ముందుగా  ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో లాగిన్ కావాలి. టికెట్ బుకింగ్‌ను మొదలు పెట్టాలి.  పేమెంట్ ఆప్షన్‌లో ఐపే అని పేమెంట్ని ఎంపిక  చేసుకోవాలి.  తర్వాత ఐఆర్‌సీటీసీ ముద్రా ఎంచుకోవాలి. మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది ఇవ్వాలి. ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే టికెట్ బుక్ సులువుగా అవుతుంది.


ఇంకా ఐముద్రా డిజిటల్ వాలెట్ కలిగినవారు వర్చువల్ లేదా ఫిజికల్ కార్డును కూడా పొందే అవకాశం ఉంది. దీంతో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేయొచ్చు. ఐఆర్‌సీటీసీ ఐముద్రా వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. వర్చువల్ కార్డుకు రూ.10, ఫిజికల్ కార్డుకు రూ.200  చెల్లించవలసిన అవసరం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: