బ్యాంకు కస్టమర్లకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. సేవింగ్ అకౌంట్ ఉన్న వారి నుంచి నెఫ్ట్ చార్జీలను వసూలు చేయకూడదని బ్యాంకులను ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం జనవరి 2020 నుండి అమల్లోకి రానుంది. కాగా రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా గతంలోనే నెఫ్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ ట్రాన్సాక్షన్లపై చార్జీలు తొలగిస్తామని ప్రకటించింది, ఇప్పుడు అది అమల్లోకి రానుంది. 


కాగా మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా జరిపే నెఫ్ట్ లావాదేవీలకు ఇప్పటికే బ్యాంకులు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. అయితే ఇకపై బ్యాంకుకు వెళ్లి ఇతరులకు నెఫ్ట్ లో డబ్బు పంపాలన్నా ఎలాంటి చార్జీలు పడకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్బీఐ వెల్లడిస్తూ ''డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి వారు వసూలు చేసే ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ట్రాన్సాక్షన్లపై చార్జీలను తొలగించాలని నిర్ణయించినట్టు, దీంతో బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలి అని, ఒక వారంలోగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయి'' అని ఆర్‌బీఐ తెలిపింది.


కాగా ఆర్‌బీఐ నెఫ్ట్ సర్వీసులు ఇక రోజంతా అందుబాటులో ఉండేలా రూపొందించాలని భావిస్తోంది. అయితే ఈ నిర్ణయం 2019 డిసెంబర్ నుంచి అమలులోకి రానుంది. ఇప్పుడు నెఫ్ట్ సర్వీసులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే డిసెంబర్ నుండి 24 గంటలు నెఫ్ట్ సర్వీసులు అందుబాటులో ఉండేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: