ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు తగ్గిస్తూ...కస్టమర్లకు షాకిచ్చింది.ఇప్పటివరకూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఉన్న వడ్డీరేట్లను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఏడాది నుంచి రెండేళ్లలోపు FDలకు ఇది వర్తిస్తుంది.దీంతో బ్యాంకులో డిపాజిట్ చేస్తే రాబడి మరింత తగ్గనుంది.

రూ.2 కోట్లకు పైన గల బల్క్ డిపాజిట్ పైన కూడా వడ్డీ రేటును తగ్గించింది. వీటిపై వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్ల నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఎస్బీఐకి అవసరమైన ద్రవ్యలభ్యత ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ వివరించింది. ఈ తగ్గింపు నిర్ణయం నవంబర్ 10వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేట్లను కూడా తగ్గించింది. ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది.దీంతో బ్యాంకు నుంచి తీసుకునే రుణాలపై వడ్డీ రేటు తగ్గుతుంది.

సాధారణ కస్టమర్లకు FD వడ్డీ రేటు: 7 రోజుల నుంచి 45 రోజుల వరకు 4.50%  46 రోజుల నుంచి 179 రోజుల వరకు ఐతే 5.50%  180 రోజుల నుంచి 210 రోజుల వరకు 5.80% 211 రోజుల నుంచి 1 ఏడాది లోపు 5.80% 1 ఏడాది నుంచి 2 ఏళ్ల లోపు 6.25%  2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల లోపు 6.25%  3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు 6.25%  5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళ వరకు 6.25%


సీనియర్ సిటిజన్లకు FD వడ్డీ రేటు:  7 రోజుల నుంచి to 45 రోజుల వరకు 5.00%  46 రోజుల నుంచి 179 రోజుల వరకు 6.00% 180 రోజుల నుంచి 210 రోజుల వరకు 6.30%  211 రోజుల నుంచి 1 ఏడాది లోపు 6.30% 1 ఏడాది నుంచి 2 ఏళ్ల లోపు 6.75%  2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల లోపు 6.75%3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు 6.75% 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళ వరకు 6.75%. ఎస్బీఐ దేశవ్యాప్తంగా వ్యాపించిన 14,000 శాఖల విస్తృత నెట్వర్క్ను కలిగి ఉంది. ఎస్బిఐ ఇచ్చిన స్థిర డిపాజిట్, డిపాజిట్ చేసిన డబ్బుపై కస్టమర్ డిపాజిట్ కొంత మొత్తంలో మరియు వడ్డీని వసూలు చేసిన ఉత్పత్తి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: