బంగారం ధరలు గత మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వస్తుంది. మొన్నటివరకు భారీగా పెరిగిన బంగారం ధర ఒక్కసారిగా నెలకు రాలింది. దీపావళి పండుగా సమయంలో భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. ఈ రోజు కూడా బంగారం ధర భారీగా తగ్గింది. 


నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిల తగ్గుదలతో 39,800 రూపాయలకు చేరింది. ఈ నేపథ్యంలోనే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 తగ్గుదలతో రూ.36,380 కు చేరింది. అయితే వెండి ధర మాత్రం కొండెక్కింది అనే చెప్పాలి. కేజీ వెండి ధర రూ.250 పెరుగుదలతో రూ.48,750కు చేరింది.


కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర అక్కడే ఉండిపోయిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర నిలకడగానే కొనసాగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. కాగా ఇక విజయవాడ, విశాఖపట్నం, అమరావతిలో కూడా ధరలు ఇలా కొనసాగాయి. కాగా బంగారంకు కొనుగోలు దారుల నుంచి డిమాండ్ తగ్గటంతో బంగారం ధర తగ్గింది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి బంగారం తగ్గటం ఎన్ని రోజులు అనేది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: