మనం సాధారణంగా ఉద్యోగాలు మారినప్పుడు గానీ, కొన్ని ట్రాంజక్షన్స్ సమయాల్లో ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు తీసుకుంటాము. కొన్నాళ్ల తర్వాత వాటిని పక్కన పెడతాం. అయితే ఇలా రెండు అకౌంట్లు ఉన్నవారికి భారీగా పెనాల్టీలు పడతాయట. మనం తీసుకున్న  బ్యాంక్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలన్స్ లేకపోతే ఛార్జీలు పడతాయి. 
ఒక వ్యక్తికే రెండు అకౌంట్లు ఉండటం.. వాటిల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండకపోతే.. అప్పుడు ఏకంగా డబుల్ పెనాల్టీలు కట్టాల్సి వస్తుందని సమాచారం.

అందుకే ఎక్కువగా అకౌంట్లు ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ అకౌంట్లు అవసరం లేకపోతే వెంటనే క్లోజ్ చేయడం మంచిదని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. కింది నియమాల్ని పాటించడం ద్వారా అనవసరంగా పడే పెనాల్టీల నుండి తప్పించుకోవచ్చు. ఉపయోగం లో లేని అకౌంట్ క్లోజ్ చేసే ముందుగా మంత్లీ ఈఎంఐ లోన్, సిస్టమ్యాటిక్ ఇన్వెస్టిమెంట్ ప్లాన్ (సిప్), రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ అకౌంట్) వంటి ఆటోమేటెడ్ డెబిట్స్ ఆ అకౌంట్‌కు లింక్ ఉంటే వాటిని ముందుగానే నిలిపివేయాలి. వాటికి ఆల్‌టర్నెట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

సంబంధిత డీ-లింకింగ్ అకౌంట్ ఫామ్‌లో ఆ ఖాతాకి చెందిన వివరాలన్నీ అందించాలి. నిరుపయోగంగా ఉన్న ఆ ఖాతా క్లోజ్ కావడానికి  దాదాపు 10 రోజుల సమయం తీసుకుంటుంది. ఆ తర్వాతే అకౌంట్ క్లోజ్ అవుతుంది. వీటితో పాటుగా...రెండో అకౌంట్‌ను ఎందుకు తొలగించాలనుకుంటున్నామో   క్లోజర్ ఫార్మ్‌లో పూర్తిగా వివరాలు తెలిపాలి. ఆ ఖాతాలో అంతేకాకుండా దానిలో ఉన్న డబ్బును ఏ ఖాతాలోకి మళ్లించాలో కూడా  వేరొక ఫామ్ ద్వారా బ్యాంక్ అధికారులకు తెలియజేయాలి.


ఆ అకౌంట్ కి సంబంధించిన చెక్ బుక్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డులు కూడా తిరిగి బ్యాంక్ కి అప్పగించాలి. అయితే కొత్త అకౌంట్‌ను ప్రారంభించిన 14 రోజుల్లోపు అకౌంట్ వద్దనుకుంటే ఎలాంటి చార్జీలు పడవు. గడువు రెండు వారాలు మించితే మాత్రం పెనాల్టీ ఛార్జీలు పడతాయి. ఒకవేళ ఆ అకౌంట్ ద్వారా మీరు పెన్షన్ పొందుతుంటే మీ సంస్థక కొత్త అకౌంట్ నెంబర్ తెలియ జేయడం మాత్రం మరవద్దు.  లేదంటే తర్వాత డబ్బులు తీసుకోవడంలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: