ఇక ప్రముఖ ఆన్లైన్ షాపింగ్  సంస్థ ఐనా  అమెజాన్ లో షావోమి మొబైల్స్ కు సంబంధించి ఎంఐ డేస్ పేరిట ఆఫర్ సేల్ మొదలు అయంది. ఈ  ఆఫర్ లో భాగంగా వివిధ షావోమి ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఇస్తుంది. అత్యధికంగా రూ.12 వేల వరకు డిస్కౌంట్ ను కూడా ఇస్తుంది.  ఇక ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో భారత నంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమికి సంబంధించిన Mi Days మళ్లీ మొదలు అయ్యాయి. అయితే ఈ ఆఫర్ సేల్ నవంబర్ 13 వరకు మాత్రమే ఉంటుంది.  ఈ ఆఫర్ సేల్ లో భాగంగా ధర తగ్గింపును అందుకున్న స్మార్ట్ ఫోన్లు గురించి తెలుసుకుందామా మరి....


పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.15,999కు, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.18,999కు ఇస్తున్నారు. 6 జీబీ + 128 జీబీ వేరియంట్ పై రూ.9,000, 8 జీబీ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ పై రూ.12,000 తగ్గింపును షావోమి ఇస్తుంది అందరికి. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో పనిచేసే ఫోన్లలో అత్యంత తక్కువ ధరకు లభించే మొబైల్ ఇదే కావడం చాల గమనార్థకం. 


అంతే కాకుండా ఇందులో వెనకవైపు 12 మెగా పిక్సెల్ + 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు, 20 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది ఈ ఫోన్.  షావోమి రెడ్ మీ వై3 ,  షావోమి ఎంఐ ఏ3 , రెడ్ మీ 7ఏ, రెడ్ మీ 7 ఇలా అన్ని ఫోన్ పై భారీ ఆఫర్స్ ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: