మార్నింగ్ ఫోన్ కి 100% ఛార్జింగ్ పెట్టుకుని ఆఫీస్ కి వెళ్ళాడు అప్పారావు, ఆఫీస్ కి వెళ్ళాక తన కొలీగ్స్ తో కొంచెం సేపు వాట్సాప్ లో చాటింగ్ చేసి ఫోన్ ను చూసుకోగా బ్యాటరీ సగం ఖాళీ అయింది. దీనితో అవాక్కయ్యాడు అప్పారావు. ఇది అప్పారావు ఒక్కడి సమస్యే కాదు ఇప్పుడు వాట్సాప్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరి సమస్య. వాట్సాప్ మీ ఫోన్ బ్యాటరీ ని ఖాళీ చేస్తుందా అంటే అవును అనే సమాధానం వస్తోంది.


ఆండ్రాయిడ్ ఫోన్లల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. వాట్సప్ అప్‌డేటెడ్ వర్షన్ ఉన్న యూజర్ల ఫోన్లల్లో బ్యాటరీ త్వరగా ఖాళీ అయిపోతోంది. ముఖ్యంగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీనిపై యూజర్లు వన్‌ప్లస్ ఫోరమ్‌, గూగుల్ ప్లే స్టోర్‌, ట్విట్టర్‌, రెడ్డిట్ ప్లాట్‌ఫామ్స్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. వాట్సప్ అప్‌డేట్ కారణంగా బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతోందని వన్‌ప్లస్ 7టీ ప్రో, వన్‌ప్లస్ 7టీ, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ యూజర్లతో పాటు మిగతా యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు.


వాట్సప్ 2.19.308 వర్షన్ ఉన్న యూజర్లందరికీ దాదాపుగా ఇదే సమస్య. రోజుకు 5 నిమిషాలు వాట్సప్ వాడితేనే 16% బ్యాటరీ ఖర్చయిపోతోందని ఒకరు కంప్లైంట్ చేస్తే, 33% బ్యాటరీ అయిపోతోందని ఇంకొకరు ఫిర్యాదు చేస్తున్నారు. వాట్సప్ యాప్‌ను 2.19.308 వర్షన్‌కు అప్‌డేట్ చేసిన తర్వాత గతంతో పోలిస్తే ఎక్కువ బ్యాటరీ ఉపయోగించుకుంటుందన్నది ఈ ఫిర్యాదుల సారాంశం. కొందరైతే వాట్సప్ డిలిట్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేస్తున్నారు. వన్‌ప్లస్, గూగుల్ పిక్సెల్, హువావే, షావోమీ, సాంసంగ్ ఫోన్లు వాడేవారి నుంచి ఈ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే దీనిపై వాట్సప్ ఇంకా స్పందించలేదు. వాట్సాప్ త్వరగా స్పందించి సమస్యకు పరిష్కారం కనుగొనాలని స్మార్ట్ ఫోన్ యూజర్లు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: