ప్రస్తుత సమాజంలో వ్యాపారం అంటే అంత సులువు కాదు. కొనుగోలుదారుడుతో నిత్యం కళకళ్లాడితేనే.. జేబులు కూడా బాగా నిండుతాయి. అందుకే  తమిళనాడులోని శివగంగ జిల్లా కరైకుడికి చెందిన చేపల వ్యాపారి పి.మనోహరన్ సరికొత్త ఆఫర్‌తో ఆహార ప్రియులను బాగా ఆకొట్టుకోవడం జరిగింది. కేజీ చేపలను రూపాయికే అమ్మడం మొదలు పెట్టాడు. దీంతో జనాలు లొట్టలేసుకుంటూ అతడి దుకాణం ముందు క్యూ లో ఉన్నారు అంటే నమ్మండి.


ప్రస్తుతం  ఏదైనా ఆఫర్ ప్రకటించారంటే.. అందులో కొన్ని ట్విస్టులు కూడా కచ్చితంగా ఉంటాయి అని అందరికి తెలిసిందే కదా. అలాగే  ఈ వ్యాపారి చూడా చిన్న ట్విస్టు పెట్టడం జరిగింది. తాను ప్రకటించిన రూపాయికే కిలో చేపల ఆఫర్.. మొదటి  వందమందికి మాత్రమేనని తెలియచేసాడు. దీంతో చేపల ప్రియులు తెల్లవారుజాము నుంచే అతడి దుకాణం ముందు క్యూకట్టారు అంటే నమ్మండి. ఈ ఆఫర్ వల్ల అతడి గల్లా పెట్టి నిండిందో లేదో గానీ.. అతడి వ్యాపారానికి మాత్రం మాంచి ప్రచారం మాత్రం దక్కించుకున్నాడు. ఈ ఆఫర్ ప్రకటించడానికి కారణం.. రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తున్న బామ్మే అని ఆ వ్యాపారి తెలిపాడు. ఈ ఆఫర్ కింద అతడు 520 కేజీల చేపలను అమ్మినట్లు కూడా తెలియచేయడం జరిగింది.


ఇది ఇలా ఉండగా మరోవైపు మనోహరన్ మాట్లాడుతూ.. ‘‘స్టోరేజ్‌లో పెట్టిన చేపలను అమ్మడం నాకు ఇష్టం ఉండదు. ఎప్పటికప్పుడు తాజా చేపలనే అమ్ముతాను. చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది తెలిపేందుకే ఈ ఆఫర్ ఇవ్వడం జరిగింది అని తెలిపాడు. కరైకుడిలోని బర్మ కాలనీలో ఏర్పాటుచేసిన దుకాణంలో తొలి వంద మందికి మాత్రమే రూపాయికి కిలో చేపలు ఇస్తాననిప్రకటించాను అని తెలిపాడు. కానీ, అక్కడికి 500 మందికి పైగా వచ్చారు. దీంతో అందరికీ రూపాయికే కిలో చేపలను ఇచ్చేశాను’’ అని తెలియచేయడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: