భారత దేశానికి ఉజ్జ్వల భవిష్యత్ ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో భారత్.. 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో డెఫ్-కనెక్ట్ కార్యక్రమంలో ఆయన ఈ ప్రసంగం చేశారు.


భారత దేశంలోని ఆవిష్కర్తల ప్రతిభతోనే ఇది సాధ్యం అవుతుందని రాజ్ నాథ్ సింగ్ అంటున్నారు. రాబోయే కాలంలో రక్షణ ఆవిష్కరణలలో భారత్ రాణిస్తుందని వెల్లడించిన రాజ్ నాథ్ సింగ్ స్టార్టప్ ల స్థాపనకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందని గుర్తు చేశారు.


చాలావరకూ స్టార్టప్ సంస్థలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భవిష్యత్తులో రక్షణ రంగంలోనూ కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ఇటీవలే మోడీ త్వరలోనే భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవుతుందని ప్రకటించారు. ఇప్పుడు రాజ్ నాథ్ సింగ్ మరో అడుగు ముందుకేశారు. నిజంగానే రాజ్ నాథ్ సింగ్ కల సాకారం అవ్వాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: