హెచ్‌ -1 బీ వీసా రూల్స్‌కి అక్కడి కోర్టులు బ్రేక్‌ వేస్తున్నా... ట్రంప్‌ సర్కార్‌ మాత్రం ఆగడం లేదు. అమెరికా పౌరులకు లాభం చేకూర్చే విధంగా ట్రంప్‌ ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి. ఈ సారి భారత ఐటీ కంపెనీలకు ఝలక్‌ ఇచ్చింది. కంపెనీలకు వీసా నిబంధనల్ని అగ్రరాజ్యం మరింత కఠినతరం చేసింది.


అమెరికాలో హెచ్ 1 బీ వీసా జారీ విషయంలో మరో కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఇప్పటికే ట్రంప్ తమ స్వదేశీయులకి మేలు చేకూర్చే విధంగా హెచ్ 1 బీ వీసా జారీ విషంలో ఎన్నో నిభంధనలు అమలు చేశారు. మరో సారి ట్రంప్ ప్రభుత్వం మరొక రూల్‌ను యాడ్‌ చేసింది. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటన చేశారు.


భారతీయ ఐటీ కంపెనీలకు వీసా నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది అమెరికా. హెచ్-1 బీ వీసా పొందే సంస్థల జాబితా నుంచి ఇండియన్ ఐటీ కంపెనీలను తొలగించినట్లు  యు.ఎస్.సి.ఐ.ఎస్ నివేదిక తెలిపింది. తొలగించిన వాటి జాబితాలో ఇండియా కంపెనీలు ఉన్నాయి. ఇక అదేసమయంలో హెచ్‌-1 బీ వీసా కోసం కొత్తగా చేసుకున్న దరఖాస్తులనూ... అమెరికా ప్రభుత్వం పెద్ద ఎత్తున తిరస్కరించినట్లు యు.ఎస్.సి.ఐ.ఎస్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో ...దాదాపు నాలుగొంతుల దరఖాస్తులను తిరస్కరించినట్లు నివేదిక తెలిపింది. 


2015 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019లో తిరస్కరణకు గురైన దరఖాస్తులు మూడురెట్లు పెరిగాయి. హెచ్‌-1బీ వీసా కలిగి ఉన్న వారి సంఖ్యలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉన్నారు. దీంతో ఈ లేటెస్ట్‌ రూల్‌ ఎలాంటి పరిణామాలని కలిగిస్తోందో వేచి చూడాలంటున్నారు ఇండియన్‌ ఐటీ నిపుణులు


మరింత సమాచారం తెలుసుకోండి: