ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు వాట్సాప్ ఉపయోగించడం చూస్తున్నాం. ఏ విషయాన్ని తెలియచేయాలన్న కూడా  వాట్సాప్ లో తెలిపే రోజులుగా మారింది ప్రస్తుత ప్రపంచం. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లు 'పెగాసస్' అనే స్పైవేర్ బారినపడిన విషయం బాగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విషయం మరుగున పడకముందే హ్యాకర్లు మరో రూపంలో వాట్సాప్ పై విరుచుకుపడ్డారు. వాట్సాప్ లోని ఓ చిన్న లోపాన్ని ఆధారంగా చేసుకుని ఎంపీ4 వీడియో ఫైల్స్ రూపంలో దాడులకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్ బుక్ ఓ ప్రకటనలో తెలియచేయడం జరిగింది.


కొందరు గుర్తు తెలియని సోర్స్ ద్వారా వీడియో లింకులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ యూజర్లకు స్పష్టం చేయడం జరిగింది. ఫోన్ లో ఆటో డౌన్ లోడ్ ఆప్షన్ ను డిజేబుల్ చేయడం ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని పేర్కొంది. వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే సైబర్ దాడుల తీవ్రత తగ్గుతుందని వెల్లడించింది.


కొత్తగా కొన్ని రకాల ఎంపీ4 వీడియో ఫైల్స్ వాట్సాప్‌లో షేర్ అవ్వడం జరుగుతున్నాయి. వీటిని ఎవరో కాదు హ్యాకర్లు పంపుతున్నారు అని సమకాహారం. ఈ వీడియో లింక్‌ను ఎవరైనా క్లిక్ చేస్తే... వెంటనే... ఆ లింకుతో వచ్చిన వైరస్ పని చేయడం ప్రారంభిస్తుంది. ఇంట్లో చొరబడిన దొంగలు విలువైన వస్తువులు ఎత్తుకుపోయినట్లు... ఆ వైరస్... ఫోన్‌లో చొరబడి... కాంటాక్ట్ నంబర్లు, ఐడీలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఇలా సమాచారం మొత్తం సేకరించి... హ్యాకర్లకు అందచేయడం జరుగుతుంది. ఈ ఫైల్స్‌ను పంపిస్తున్న హ్యాకర్లు... వైరస్ ఫోన్‌లో చేరగానే... ఫోన్‌ను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకొంటున్నారని వాట్సాప్ తెలియచేయడం జరిగింది. కాబ్బటి యూజర్లు జరా జాగ్రత్త ఏ లింక్ పడితే ఏ లింక్ ఓపెన్ చేయకండి అని అధికారులు  తెలియచేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: