ప్రపంచవ్యాప్తంగా  సోషల్‌ వీడియో యాప్‌ ఐనా టిక్‌టాక్‌ గూగుల్‌ ప్లే సహా యాప్‌ స్టోర్‌ నుంచి 150 కోట్ల డౌన్‌లోడ్లను చేరుకోగా 46.8 కోట్ల యూనిక్‌ ఇన్‌స్టాల్స్‌తో భారత్‌ నెంబర్‌ వన్‌గా నిలవడం జరిగింది. టిక్‌టాక్‌ డౌన్‌లోడ్స్‌లో 31 శాతం భారత్‌ నుంచే ఉండడం చాల గమనార్హం. ప్రస్తుత ప్రపంచంలో టిక్‌టాక్‌ యూజర్లు బాగా పెరిగిపోయారు అనే దానికి ఇదే నిదర్శనంగా నిలుస్తుంది. మనం రోజు చూస్తున్నం టిక్‌టాక్‌ వల్ల ఇంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని. కానీ ఎవరు ఏమి పట్టించుకోవడం లేదు. కొన్ని సందర్భాలలో సందర్భాలలో కొంత మంది ఉద్యోగుల సైతం పోగొట్టుకున్న విషయం మనం గమనిస్తున్నాం. 


దేశంలో వేగవంతమైన 4జీ నెట్‌వర్క్ ప్రజలకు అందుబాటులోకి రావడంతో నెటిజన్లు ఇంటర్నెట్‌లో అదీ ఇదీ అని చూడకుండా ప్రజలు వారికీ నచ్చినవన్నీ  డౌన్‌లోడ్స్ చేసేస్తున్నారు. 2019లో టిక్‌టాక్‌ గత ఏడాది కంటే ఆరు శాతం అధికంగా 61.4 కోట్ల డౌన్‌లోడ్స్‌ సాధించిందని మొబైల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ సెన్సార్‌ టవర్‌ వెల్లడించడం జరిగింది. 


2019లో భారత నెటిజన్లు ఇప్పటివరకూ 27.6 కోట్ల వరకూ టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, గ్లోబల్‌ ఇన్‌స్టాల్స్‌లో ఇది 45 శాతం వరకూ ఉంటుందని ఆ నివేదిక తెలియచేయడం జరిగింది. ఇక చైనా 4.5 కోట్ల డౌన్‌లోడ్స్‌తో రెండవ అత్యధిక డౌన్‌లోడర్‌గా, 3.6 కోట్ల డౌన్‌లోడ్స్‌తో అమెరికా టాప్‌లో ౩వ స్థానంలో నిలిచాయి. టిక్‌టాక్‌ 61 కోట్ల డౌన్‌లోడ్స్‌తో ఈ ఏడాది అత్యధిక డౌన్‌లోడింగ్‌ నాన్‌ గేమింగ్‌ యాప్‌ విభాగంలో మూడవ స్ధానంలో ఉంది. వాట్సాప్‌ 70.74 కోట్లతో, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ 63.2 కోట్లతో ఈ ఏడాది అత్యధిక డౌన్‌లోడింగ్‌ యాప్‌లుగా టాప్‌ 2 స్ధానాలను దక్కించుకోవడం జరిగింది. మొత్తానికి ఈ జాబితాలో భారత్ తరువాత చైనా, ఆ తరువాత స్థానంలో అమెరికా ఉండడం జరిగింది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: