షియోమి ఫోన్లు ఉపయోగించేవారికి క్విక్ అప్స్ అనే యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ యాప్ ను గూగుల్  ప్లేస్టోర్ నుంచి తొలిగించింది. తమ ప్లే ప్రొటెక్ట్  పాలసీని సరిగ్గా పాటించనందువల్లనే ఆ యాప్ ను బ్లాక్ చేసినట్లు గూగుల్ తెలియచేయడం జరిగింది. ఈ విషయాన్ని పలువురు షియోమి స్మార్ట్ ఫోన్ యూజర్లు ట్వీటర్, రెడిట్ ద్వారా తెలియచేయడం జరిగింది. ఈ యాప్ మిమ్మల్ని ట్రాక్ చేయడానికి ఉపయోగించే డేటాను సేకరిస్తుందనే పాపప్ మెసేజ్ ద్వారా తెలియచేస్తుంది. నవంబర్ 14 తర్వాత వచ్చిన అప్ డేట్ అనంతరం గూగుల్ ఈ యాప్ ను బ్లాక్ చేసినట్లు తెలియచేయడం జరిగింది.

 

ఇక గూగుల్ ప్లే ప్రొటెక్ట్ మీ స్మార్ట్ ఫోన్ డివైస్ ని సురక్షితంగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది అని అందరికి తెలుసు. ప్లేస్టోర్ లో ఉండే యాప్ లను, మీ ఫోన్ లో ఉండే యాప్ లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. మీరు ఏదైనా యాప్ ను డౌన్ లోడ్ చేసేముందు కూడా దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. హాని కలిగించే యాప్ లు ప్లేస్టోర్ ద్వారా మీ ఫోన్ లోకి రాకుండా చూడటమే దీని ముఖ్య ప్రక్రియ. ఒకవేళ ముందుగా ఇన్ స్టాల్ చేసిన యాప్స్ లో ఎందులోనైనా హాని కలిగించే వైరస్ లు ఉన్నట్లయితే వాటిని కూడా బ్లాక్ చేసుకునే సదుపాయం కల్పిస్తుంది.

 

ఈ యాప్ను ఎందుకు బ్లాక్ చేసిందో అన్న విషయాలను గూగుల్ స్పష్టమైన కారణాన్ని తెలియచేయలేదు వాస్తవానికి. అయితే ఈ క్విక్ యాప్స్ మన ఫోన్ కు సంబంధించిన 55 రకాల సిస్టం లెవల్ పర్మిషన్లను కలిగి ఉంటుంది. అందువల్లనే దీన్ని బ్లాక్ చేసినట్లు టెక్ నిపుణులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ లో షియోమిపై ఈ విషయమై అభియోగాలు కూడా రావడం జరిగింది. అయితే ఈ యాప్ ప్లేస్టోర్ లో అందుబాటులో లేకపోయినా షియోమి ఎంఐయూఐలో ఇంకా ఉండడం జరిగింది. ఇన్ బిల్ట్ యాప్ కాబట్టి మీరు దీన్ని అన్ ఇన్ స్టాల్ చేయలేరు. డిసేబుల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. తమ వినియోగదారుల ప్రైవసీకి గూగుల్ అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: