ఇండియన్ రైల్వేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మన దేశంలో ఎక్కువమంది ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద ప్రభుత్వ సంస్ద ఇండియన్ రైల్వేస్. అయితే ఈ రైల్వేస్ లో టికెట్ బుకింగ్ ప్లాట్ పామ్ లో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఇది. ఇందులో కేవలం టికెట్ బుకింగ్ మాత్రమే కాకుండా క్యాటరింగ్ సర్వీసులు కూడా ఉన్నాయి. 

 

అయితే ప్రతిరోజు భారతీయ రైల్వే రెండు కోట్లమంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. ఈ ఐఆర్సిటీసీ ద్వారా కొన్ని కోట్లమంది రైలు టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ద్వారా మీరూ డబ్బు బాగా సంపాదించొచ్చు. అయితే ఇలా బాగా డబ్బు సంపాదించాలంటే మీరు ఐఆర్‌సీటీసీ ఆథరైజ్డ్ టికెట్ బుకింగ్ ఏజెంట్‌గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 

 

ఈ ఐఆర్‌సీటీసీ ఆథరైజ్డ్ టికెట్ బుకింగ్ ఏజెంట్‌గా రిజిస్టర్ చేసుకోవడం వల్ల ప్రతి నెల ఆదాయం వస్తుంది. అయితే ఈ ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్‌‌లు ఎలాంటి సేవలు అందించొచ్చు? ఎలాంటి లాభాలు ఉంటాయి? అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఈ టికెట్ బుకింగ్ ఏజెంట్ కి ప్రత్యేకంగా నియమ నిబందనలు ఏవి లేవు.. ఎవరైనా టికెట్ బుకింగ్ ఏజెంట్ కావొచ్చు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ రెండు ప్లాన్స్ ఆఫర్ ఇచ్చింది. 

 

ఏడాది ఏజెన్సీ కోసం రూ.3999, రెండేళ్ల ఏజెన్సీ కోసం రూ.6999 చెల్లించాలి. ప్రతీ నెలా 100 టికెట్లు బుక్ చేస్తే టికెట్‌కు రూ.10 ఛార్జ్ చేస్తుంది ఐఆర్‌సీటీసీ. 101 నుంచి 300 టికెట్లు బుక్ చేస్తే టికెట్‌కు రూ.8, అంతకన్నా ఎక్కువ బుక్ చేస్తే టికెట్‌కు రూ.5 చొప్పున ఛార్జీలు ఉంటాయి. నాన్ ఏసీ క్లాస్ అయితే టికెట్‌కు రూ.20, ఏసీ క్లాస్ అయితే రూ.40 కమిషన్ లభిస్తుంది. టికెట్ల బుకింగ్‌ని బట్టి మీరు నెలకు రూ.80,000 వరకు ఆదాయం పొందొచ్చు.  

 

దీంతో ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్‌‌లు ఎన్ని టికెట్లైనా బుక్ చేసుకోవచ్చు, అలాగే బుక్ చేసిన టికెట్లను క్యాన్సిల్ కూడా చెయ్యచ్చు. సాధారణ ప్రజలకు తత్కాల్ టికెట్ అందుబాటులోకి వచ్చిన 15 నిమిషాల తర్వాత టికెట్లు బుక్ చేయొచ్చు. కానీ ఏజెంట్ వ్యాలెట్ నుంచి రైల్వే టికెట్ డబ్బులు డెబిట్ అవుతాయి. టికెట్ బుకింగ్ ప్రాసెస్ వేగంగా జరుగుతుంది. 

 

ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌కు ఐఆర్‌సీటీసీ ఆథరైజ్డ్ వెబ్ సర్వీస్ ప్రొవైడర్‌ నుంచి సపోర్ట్ ఉంటుంది. రైలు టికెట్లు మాత్రమే కాదు ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్ నుంచి డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్లు, బస్, హోటల్, హాలిడే, టూర్ ప్యాకేజీలు కూడా బుక్ చేయొచ్చు. కాగా ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌లు మనీ ట్రాన్స్‌ఫర్, ప్రీపెయిడ్ రీఛార్జ్ లాంటి మరిన్ని సేవలను కూడా అందిస్తుంది. 

 

అయితే ఈ ఏజెంట్ కావడానికి ఉండాల్సిన డాక్యుమెంట్లు.. పాన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, ఈమెయిర్ ఐడీ, ఫోటో, అడ్రస్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు అన్ని ఉండాలి. అప్పుడే మీరు కూడా ఐఆర్‌సీటీసీ ఆథరైజ్డ్ టికెట్ బుకింగ్ ఏజెంట్‌గా అవుతారు. చూశారుగా.. కేవలం 3,999 రూపాయలతో 80,000 వేలు ఎలా సంపాదించాలి అనేది. ఇంకెందుకు ఆలస్యం ఇంట్రెస్ట్ ఉంటె మీరు కూడా వెళ్లి జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం పెద్ద విషయం కాదు.. అందులో తెలివిగా సంపాదించడం పెద్ద విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: