ప్రముఖ టెలికాం దిగ్గజం జియో అక్టోబర్ లో టారిఫ్ రేట్లు పెంచిన సంగతి అందరికి తెలిసిందే. అయితే దీనికి తగినట్లు ఐయూసీ ప్యాక్ ల ద్వారా డేటాను కూడా ఇవ్వడం మొదలు పెట్టింది. కానీ ఈ రేట్లు పెంచినందుకు ఇంటా బయటా అన్ని వైపులా విమర్శలు వచ్చిన సంగతి కూడా  అందరికి  తెలిసిందే కదా. అయితే అంబానీ ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. 

 

Image result for jio

 

ఒక వైపు ఈ రేట్లు పెంపు జరిగినా.. మరోవైపు చడీచప్పుడూ లేకుండా మరో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలోనే అతి పెద్ద టీవీ నెట్ వర్క్ ల్లో ఒకటైన సన్ గ్రూపు ఓటీటీ ప్లాట్ ఫాం సన్ నెక్స్ట్ లోని కంటెంట్ ను జియోకు సంబంధించిన జియో సినిమా యాప్ లో ఉచితంగా మనము చూసుకునే అవకాశం లభించింది జియో. 

 

Image result for jio

 

జియో సినిమా యాప్ విషయానికి వస్తే.. రిలయన్స్ జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లు ఈ యాప్ ను డౌన్ లోడ్  చూసుకునే అవకాశం  ఉంది. ఒక రకంగా చూస్తే.. ఇది జియో వినియోగదారులకు మాత్రమే అంబానీ ఉచితంగా అందించే స్ట్రీమింగ్ సర్వీస్ అనుకోవచ్చు. ఇందులో దేశంలోని వివిధ భాషలకు చెందిన సినిమాలు ఉచితంగా మనకు లబిస్తుంది. 

 

అంతే కాకుండా డిస్నీతో చేసుకున్న ప్రత్యేక ఒప్పందం ద్వారా డిస్నీకి సంబంధించిన కంటెంట్ కూడా ఉచితంగా చూడవచ్చు. ఇప్పుడు ఈ ఒప్పందంతో జియో సినిమా వివిధ టెల్కో ఓటీటీ యాప్స్ అయిన వొడాఫోన్ ప్లే, ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ లపై పైచేయి సాధించిందనే చెప్పాలి ఇంకా.  ఇప్పటికే గిగాఫైబర్ సేవలను న్యూఢిల్లీ, ముంబైల్లో పైలెట్ ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది జియో. 

మరింత సమాచారం తెలుసుకోండి: