ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు దుమ్ము దులుపుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు షేర్ నిన్న (గురువారం) 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఈ షేర్ల దుమ్ముదులపడానికి కారణం అయ్యింది. ఈ బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ షేరుపై ఓవర్ వెయిట్‌తో ఉంది. అయితే ఇందులో మోర్గాన్ స్టాన్లీ ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ ధర వచ్చే రెండేళ్ల కాలంలో రెట్టింపు అవుతుందని అంచనా వేశారు. 

 

మార్కెట్‌లో, బ్యాంకింగ్ రంగంలో ఈ స్టాక్ అద్భుతమైన పనితీరు చూపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే ఓవర్‌వెయిట్ రేటింగ్ ఇచ్చింది అని అంటున్నారు. కాగా షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారు ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్‌కు ప్రాధాన్యం ఇవ్వచ్చు అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ షేరు గత 18 నెలలుగా మంచి పనితీరు కనబరిచిందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.       

 

అయితే ఇతర ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే ఐసీఐసీఐ బ్యాంక్ షేరు వ్యాల్యుయేషన్ ఇంకా తక్కువ స్థాయిల్లోనే ఉందని కూడా పేర్కొంటున్నారు. వ్యాల్యుయేషన్స్ ఆకర్షణీయంగా ఉండటం వల్ల స్టాక్‌ను కొనుగోలు చేసుకోవచ్చని చెప్తున్నారు. కాగా ఈ షేర్ల రేటు పెరగటానికి వివిధ కారణాలు ఉన్నాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇందులో అసెట్ క్వాలిటీ, బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 


 
అలాగే రుణ వృద్ధి, నికర వడ్డీ ఆదాయం, ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుదల వంటి అంశాలు షేరు ర్యాలీకి దోహదపడతాయని వివరించారు. అయితే ఈ షేరు ర్యాలీకి దోహదపడే అంశాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్ధిక వ్యవస్ద మందగమనం కూడా ఈ బ్యాంకుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: