ఇటీవ‌లే... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశాలు జారీ చేశారు. సాధారణ సెలవులుగా 28 పండగలు, జయంతి దినోత్సవాలు, ఉత్సవాల రోజులను ప్రకటించారు. వీటిలో ఐదు పండగలు, జయంతులు ఆదివారం లేదా రెండో శనివారం వచ్చాయి. అలాగే 20 రోజులను ఐచ్ఛిక సెలవులు (ఆప్షనల్ హాలీడేస్) గా ప్రకటించారు. వీటిలో మూడు సెలవులు ఆదివారం రోజు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈ 20 ఐచ్ఛి క సెలవుల్లో ఏవైనా ఐదు రోజులను సెలవులుగా వాడుకోవ చ్చు. 

 

అయితే, ప్ర‌భుత్వం సెల‌వుల‌తో పాటు మ‌రో ముఖ్య‌మైన అంశం బ్యాంకులు. బ్యాంకుల సెల‌వుల గురించి తెలియ‌క‌పోతే...ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. బ్యాంకు వేళలు, సెలవుల గురించి  తెలుసుకోవడం లావాదేవీలు చేసే వారికి అత్య‌వ‌స‌రం. ముఖ్య విష‌యం ఏంటంటే రాబోయే డిసెంబర్‌లో బ్యాంకులు ఎనిమిది రోజులు పనిచేయవు. ఈ ఎనిమిది రోజుల్లో ఐదు ఆదివారాలు, రెండు శనివారాలతో పాటు క్రిస్మస్ సెలవు కూడా ఉంది. కాబ‌ట్టి ఈ సెల‌వుల‌ను బ‌ట్టి మ‌న లావాదేవీల వ్య‌వ‌హారాల‌ను ప్లాన్ చేసుకోవాల‌న్నమాట‌. 

 

తేదీల వారీగా సెల‌వుల వివ‌రాలు ఇవే.

డిసెంబర్ 1, 2019- ఆదివారం
డిసెంబర్ 8, 2019 - ఆదివారం
డిసెంబర్ 14 ,2019- రెండో శనివారం
డిసెంబర్ 15,2019 - ఆదివారం

డిసెంబర్ 22, 2019- ఆదివారం
డిసెంబర్ 25,2019  - క్రిస్మస్ (బుధవారం)
డిసెంబర్ 28,2019 - నాలుగో శనివారం
డిసెంబర్ 29,2019 - ఆదివారం

మరింత సమాచారం తెలుసుకోండి: