బంగారం ధరలు అసలు అర్థం కావు.. ఒకరోజు భారీగా పెరిగితే మరో రోజు భారీగా తగ్గుతుంది. ఇలా తగ్గుతూ పెరుగుతూ వచ్చే బంగారం ధర కేవలం ఐయుదు రోజుల్లోనే ఐయుదు వందల రూపాయిలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో బలిహీనమైన ట్రెండ్, జువెలర్ల నుండి భారీగా డిమాండ్ తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

 

హైదరాబాద్ మార్కెట్ లో నేడు మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిల తగ్గుదలతో 39,570కు రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 190 రూపాయిల తగ్గుదలతో 36,270కు రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర 46,650 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

 

అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్ లోను పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిల తగ్గుదలతో 38,200 రూపాయలకు చేరింది. కాగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయిలు తగ్గుదలతో 37,000 రూపాయలకు చేరింది.

 

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణంగా బంగారం, వెండి తగ్గుతూ వస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. వాల్‌స్ట్రీట్‌ సరికొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేయడం కూడా ఇన్వెస్టర్లను బంగారం పెట్టుబడులకు దూరం చేసింది రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం బంగారం, వెండి కొనాలనుకునేవారు వెంటనే కోనేయండి. ఎందుకంటే రేపు మళ్ళి ఎంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: