ప్రస్తుతరోజుల్లో ఎవ్వరూ ఇంట్లో డబ్బులు ఉంచుకోవటం లేదు. అందరూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వాడడం మొదలు పెట్టారు. ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మనకి చాలా అప్లికేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ తరుణంలోనే ఎక్కువగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటివి ఎక్కువగా వాడుతూ ఉంటారు  అందరు. కానీ తాజాగా  గూగుల్ పే వినియోగదారులకు ఇది శుభవార్త. స్క్రాచ్ కార్డును రూ.500 నుండి రూ.5000 వరకు పొందండి. లింక్‌పై క్లిక్ చేసి ఇప్పుడే పొందండి’’ అంటూ మీ వాట్సాప్‌కు చాల మెసేజులు వస్తున్నాయా? అయితే, జాగ్రత్తగా ఉండండి  మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు ఖాళీ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అసలు ఏమిటి ఇది... నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, తాజాగా సైబరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన గురించి మీకు తెలియాల్సిందే..

 

సైబరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌కు ఇటీవల ‘గూగుల్ పే’ తరహాలోనే ఓ మెసేజ్ రావడం జరిగింది. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం మీ కేవైసీ, ఖాతా వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. లేకపోతే మీ బ్యాంకు లావాదేవీలు నిలిచిపోతాయని ఆ మెసేజ్లో  ఉంది. అందులో ఓ గూగుల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఆయన దాన్ని క్లిక్ చేసి వివరాలు నమోదు చేయడం జరిగింది. అవి సైబర్ నేరగాళ్లకు చిక్కడంతో ఆయన అకౌంట్లో ఉన్న రూ.5.29 లక్షలు  మటుమాయం అయిపోయాయి..

 

 


ఇక ఆ లింకు మాత్రమే కాదు.. తాజాగా వాట్సాప్ తదితర సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తున్న  ‘గూగుల్ పే’ స్క్రాచ్ కార్డు లింకును క్లిక్ చేయడం కూడా చాలా ప్రమాదం. ఆ లింకు క్లిక్ చేస్తే రూ.500 నుంచి రూ.5000 వరకు వస్తాయంటూ వస్తున్న ఆ మెసేజులు క్లిక్ చేసినా, అందులో మీ వివరాలు పొందుపరిచినా మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యేఅవకాశాలు చాలా ఉన్నాయి. ఈ లింకు క్లిక్ చేసిన చాలామందికి అందులో నగదు వచ్చినట్లు తెలుస్తుంది. కానీ, ఆ డబ్బు మాత్రం వారి అకౌంట్లోకి  రావడం లేదు.  కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: