ప్రస్తుత కాలంలో 40 సంవత్సరములు వయస్సు దాటినా మహిళలు చాలా రకాలైన వ్యాధులను అనుభవిస్తున్నారు. ఉదాహరణకు నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, థైరాయిడ్ గర్భ సంబంధమైన ఎన్నో రకాల రోగాలతో బాధపడుతున్నారు. అందుకనే మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర వైద్య బీమా పథకం ‘మై హెల్త్‌ ఉమెన్‌ సురక్షా’ను ప్రముఖ బీమా సంస్థ అయినా హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో తాజాగా ఆవిష్కరించడం జరిగింది. మహిళల జీవితంలో వైద్య పరంగా అత్యవసర పరిస్థితులు, అనారోగ్య సమస్యల సమయంలో ఒక్కోసారి డబ్బు ఇబ్బందులు నుంచి బయట పట్టడానికి  ఆర్థిక సాయం అందించే లాగా ఈ పాలసీని బీమా కంపెనీ సంస్థ మహిళల ముందుకు తీసుకొని రావడం జరిగింది.

 

HDFC ERGO Launches my <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HEALTH' target='_blank' title='health-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>health</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=WOMAN' target='_blank' title='woman-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>woman</a> Suraksha - Sakshi

 

ఇక పాలసీ రెన్యువల్‌ చేసే సమయంలో మహిళల ఫిట్‌నెస్‌ (శారీరక, మానసిక ధృడత్వం) ఆధారంగా తగ్గింపు వర్తించడం జరుగుతుంది. వ్యాధి నిరోధక ముందస్తు వైద్య పరీక్షలు, హెల్త్‌ కోచింగ్, పోషకాహారం, సరైన స్థాయిలో బరువు ఉండేలా చూడడం తదితర అంశాల్లో వివరాలు ఇవ్వడం జరుగుతుంది. మహిళలు ఫార్మసీ కొనుగోళ్లు చేసేటప్పుడు వీలైనంత వరకు తగ్గింపులు ఇవ్వడం జరుగుతుంది. ఇక గర్భధారణ సమయంలో కౌన్సెలింగ్, ఒత్తిడిని, బీపీని ,షుగర్ను ,అనవసరమైన సమస్యలను అదుపులో ఉంచుకోవడం ఎన్నో అంశాల్లో హెచ్‌డీ ఎఫ్‌సీ ఎర్గో ‘మై హెల్త్‌ ఉమెన్‌ సురక్షా’ పాలసీ దారులకు చాల అండగా ఉంటుంది.

 

ఇక పాలసీకి అర్హులు విషయానికి వస్తే 18–65 సంవత్సరాల వయసులోని వారు అప్లై చేసుకోవచ్చు.  మహిళలు భిన్న వయసుల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.. వీటిల్లో  ముఖ్యంగా  కేన్సర్, గుండె జబ్బులు, గర్భధారణ సమయంలో ప్రాణ ప్రమాదం ఇలా ఎన్నో అవసరాల్లో మద్దతుగా నిలిచేలా, కష్టకాలంలో ఉపయోగపడేలా మై హెల్త్‌ ఉమెన్‌ సురక్షా ప్లాన్‌ ను నిర్ధారించడం జరిగింది. ఈ విషయాలు అన్నీ కూడా  హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఎండీ, సీఈవో రితేష్‌ కుమార్‌ తెలియచేయడం జరిగింది. రాష్ట్రంలో  ఇలాంటి పథకాలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ మనము ఆ పథకాలను ఎంచుకునేటప్పుడు కొంచెం ఆలోచించి ఎంచుకుంటే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: