బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌ బ్యాండ్  ఉపయోగించే వారికీ ఒక శుభ వార్త...  బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లకు మంచి అవకాశం కల్పిస్తుంది.  బీఎస్ఎన్ఎల్ రూ.777 ప్లాన్‌ను వినియోగదారుల ముందుకు తీసుకుని రావడం జరిగింది. వాస్తవానికి  ఈ ప్లాన్ కొత్తేమీ కాదు...  ఇంతకుముందు యూజర్లకు పరిచయం ఉన్న ప్లానే. కానీ... కొన్నినెలల క్రితం ఈ ప్లాన్‌ను రద్దు చేయడం జరిగింది. మళ్లీ అదే ప్లాన్‌ను వినియోగదారుల  ముందుకు తీసుకొచ్చింది.

 


ఇలా   బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను నిలిపివేయడం, మళ్లీ తీసుకురావడం సర్వ సాధారణం అని అధికారులు తెలియయచేస్తున్నారు. ఇలా ప్లాన్ ని మళ్లీ తీసుకుని రావడంతో వినియోగదారులకు కొత్త బెనిఫిట్స్‌ని ప్రకటించడం జరిగింది. ఇక ఈ ప్లాన్ తీసుకునే బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు 50 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌తో డేటా లభిస్తుంది. ఇంకా  500 జీబీ డేటా లభించడం జరుగుతుంది. ఒక వేళా 500 జీబీ డేటా వాడిన తర్వాత కూడా  ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది అంతే.  

 

ఇక  బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వేలిడిటీ  విషయానికి వస్తే 6 నెలలు. ఇక సబ్‌స్క్రైబర్లకు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితంగా చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ వ్యాలిడిటి అయిపోయిన  తర్వాత  రూ.999 ప్లాన్‌కు మారిపోయేలా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో 600 జీబీ డేటా లభిస్తుంది. ఇక  రూ.777 డేటా ప్లాన్ అందరికీ వర్తించదు. కొత్తగా ప్లాన్ తీసుకున్న వారికి  మాత్రమే.

 

ఇక బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు రూ.777 ప్లాన్ బాగా పరిచయం ఉన్నదే. కానీ... ఈ ప్లాన్ ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియని అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ రూ.777 ప్లాన్‌ను ప్రకటించినా... ఈ సారైనా బ్రేక్ లేకుండా ఈ ప్లాన్ కొనసాగుతుందా అని పలు అనుమానాలు వస్తున్నాయి ప్రజలలో. ఇక ఇటీవల బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ రూ.555 ప్లాన్‌ను కూడా విడుదల చేయడం జరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: