పసిడి ప్రియులకు భారీ గుడ్ న్యూస్ ఇది. గత రెండు రోజులుగా తగ్గుతున్న బంగారం ధర ఈరోజు మళ్ళి దిగొచ్చింది.. ఏంటో ఈ బంగారం ధరలు ఎప్పుడు ఎలా తగ్గుతాయే అసలు అర్ధమే కావు.. ఒకరోజు భారీగా పెరిగితే మరో రోజు భారీగా తగ్గుతాయి. ఇలా తగ్గుతూ పెరుగుతూ వచ్చే బంగారం ధర మొన్నటి నుండి తగ్గటం ప్రారంభించింది. ఈరోజు కూడా బంగారం ధర భారీగా తగ్గింది. 

 

అంతర్జాతీయ మార్కెట్ లో బలిహీనమైన ట్రెండ్, జువెలర్ల నుండి భారీగా డిమాండ్ తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అయితే నేడు హైదరాబాద్ మార్కెట్ లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 190 రూపాయిల తగ్గుదలతో 39,530 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 290 రూపాయిల తగ్గుదలతో 36,120కు రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర పెద్ద షాక్ ఇచ్చింది. ఆ షాక్ ఏంటి అనుకుంటున్నారా ? అదేనండి కేజీ వెండి ధర 1000 రూపాయిలు తగ్గుదలతో 46,500 రూపాయిలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి.  

 

విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్ లోను పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిల తగ్గుదలతో 38,050 రూపాయలకు చేరింది. కాగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 120 రూపాయిలు తగ్గుదలతో 37,880 రూపాయలకు చేరింది. 

 

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణంగా బంగారం, వెండి తగ్గుతూ వస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం బంగారం, వెండి కొనాలనుకునేవారు వెంటనే కోనేయండి. ఎందుకంటే రేపు మళ్ళి ఎంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. 

మరింత సమాచారం తెలుసుకోండి: