గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం బ్యాంకుల్లో డిపాజిట్లకు వస్తున్న వడ్డీ రేట్ చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఒకవేళ మీరు మీ డిపాజిట్లకు ఎక్కువ వడ్డీలను సంపాదించాలనుకుంటే... మేము చెప్పేది రిలీజియస్ గా పాటించండి.

ఇక వివరాల్లోకి వెళితే... ఎల్ అండ్ టి ఫైనాన్స్ కంపెనీ ఎన్ సీ డి లను అతి త్వరలోనే జారీ చేస్తుంది. అయితే ఈ కంపెనీలో మీ డబ్బులను డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది.



ఎల్అండ్‌టీ ఫైనాన్స్ అనే సంస్థ ఎల్అండ్‌టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ వారికి సంబంధించిన్నది. ప్రస్తుతం ఈ ఫైనాన్స్ సంస్థ రూ.1,500 కోట్ల వరకు నిధులు సమీకరించే లక్ష్యంతో సెక్యూర్డ్ రీడిమబుల్ నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్స్ (ఎన్‌‌సీడీ) ఇష్యూ చేయడానికి సిద్ధమైంది. ఈనెల అంటే డిసెంబర్ 16న మొదటి విడత ఎన్‌సీడీల జారీ మొదలవుతుంది. అదేవిధంగా, డిసెంబర్ 30 తేదీన ముగుస్తుంది. ఈ కంపెనీ యొక్క ప్రధాన ప్రణాళిక చూసుకుంటే... 500 కోట్ల రూపాయలను మొట్టమొదటిగా సమీకరించాలని లక్ష్యంతో ఉంది. ఒకవేళ ఈ సంస్థకు మంచి స్పందన వస్తే.. వెయ్యి కోట్లను ఎక్కువగా సమీకరించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పదిహేను వందల కోట్ల నిధులను ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ రుణ వ్యాపారానికి, ఇంకా వారి సంస్థ రుణాలకు, ఇతర కార్యకలాపాలకు ఉపయోగించనుంది.


ఎన్ సి డి లలో మొత్తం నాలుగు రకాలు ఉంటాయి. అవి ఏంటంటే...

 

ఔత్సాహికులు కేటగిరి 1 (ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు),

కేటగిరి 2 (నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు),

కేటగిరి 3 (సంపన్నులు),

కేటగిరి 4 (రిటైల్ ఇండివీడువల్ ఇన్వెస్టర్లు).

ఈ నాలుగు కేటగిరీలలో మీకు నచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. మినిమం పదివేల రూపాయలను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.



ఇకపోతే... ఎన్‌సీడీలు కాల వ్యవధులను ఒకసారి చూసుకుంటే... 36 నెలలు, 60 నెలలు, 54 నెలలు.. ఈ విధంగా మూడు రకాల కాల వ్యవధులను ఎల్అండ్‌టీ సంస్థ ఆఫర్ చేయనున్నది.

అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు వడ్డీని, నెలవారీగా, వార్షికంగా ఫిదా మెచ్యూరిటీ సమయంలో ఈ ఫైనాన్స్ సంస్థ మీకు చెల్లిస్తోంది. ఎన్‌సీడీలపై వడ్డీ రేటు.. 8.45 నుంచి 8.65 పర్ సేంట్ మధ్య ఉంటుంది.


'ఇన్వెస్టర్లు 235 బేసిస్‌ పాయింట్లు (2.35 శాతం) అధికంగా బ్యాంకు డిపాజిట్ల కంటే ఇందులో రాబడి పొందొచ్చు. పైగా ఏఏఏ రేటింగ్‌ కలిగిన సాధనం. దీంతో ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది' అని మనీహానీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎండీ అనూప్‌ భయ్యా వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: