ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కు(ITR) సంబంధించి ఆదాయపు పన్ను శాఖ మరోసారి కీలక ప్రకటన చేసింది. 2019, డిసెంబర్ 31వ తేదీ లోపు ఐటీఆర్ వివరాలను పైల్ చేయాలంది. డిసెంబర్ 31లోపు ఫైల్ చేస్తే రూ.5వేలు జరిమానా పడుతుందని, డిసెంబర్ 31 తర్వాత చేస్తే రూ.10వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పన్ను చెల్లింపుదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది. ఇప్పటికే పలుమార్లు ఐటీఆర్ దరఖాస్తుల గడువును కేంద్ర ప్రభుత్వం సవరించిన సంగతి తెలిసిందే.

 

2018-19కి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్స్న్ ఫైల్ చేయడానికి ఆగస్టు 31 లాస్ట్ డేట్. అయితే ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయని వారికి డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే రూ.10వేలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
ట్యాక్సబుల్ లిమిట్ కన్నా ఆదాయం తక్కువ అయితే లేట్ ఫైలింగ్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయం రూ.5లక్షలు మించకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

 

2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 31.ఈ తేదీలోగా ఐటిఆర్ దాఖలు చేయలేకపోతే డిసెంబర్ 31 వరకు దాఖలు చేయడానికి సమయం.ఈ గడువును కోల్పోతే భారీ పెనాల్టీ తప్పదు. ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 234 ఎఫ్ కింద ఆలస్యంగా దాఖలు చేసే చట్టాన్ని బడ్జెట్ 2017 ప్రవేశపెట్టింది. 

 

2018-19 నుండి అమల్లోకి వచ్చింది. 2019 డిసెంబర్ 31 లోపు ఫైల్ చేస్తే రూ.5వేలు ఫైన్,2019 డిసెంబర్ 31 తర్వాత 2020 మార్చి 31 కి లోపు అయితే రూ.10వేలు జరిమానా. ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే పరిమితి కంటే తక్కువగా ఉంటే, లేట్ ఫైన్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయం రూ.5 లక్షలకు మించకపోతే.. చెల్లించాల్సిన గరిష్ట ఫైన్ రూ .1,000.

మరింత సమాచారం తెలుసుకోండి: