ఈ మధ్యకాలంలో గుడ్ న్యూస్ లు ఎక్కువ అయిపోయాయి. రోజు రోజుకు క్యాష్ బ్యాక్ అంటూ ఆఫర్లు ఎక్కువ అయిపోయాయి. ఇంకా అసలు విషయానికి వస్తే.. బ్యాంక్ ఖాతాదారులకు ఓ చక్కటి శుభవార్త.. అయితే ఆ శుభవార్త కేవలం రూపే కార్డు ఉన్నవారికి మాత్రమే.. ఈ రూపే కార్డు ఉంటే అదిరిపోయే ఆఫర్లు పొందొచ్చు. 

 

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపే కార్డులు ఉపయోగించే వారి కోసం సూపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇది అందరికీ అందుబాటులో లేదు. విదేశాల్లో ప్రయాణించే వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఏ దేశాల్లో వర్తిస్తుంది అంటే.. యూఏఈ, సింగపూర్, శ్రీలంక, యూకే, అమెరికా, స్పెయిన్, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లే భారతీయులు  రూపే ఇంటర్నేషనల్ కార్డు యాక్టివేట్ చేసుకుంటే నెలకు రూ.16,000 ఆదా చేసుకోవచ్చని ఎన్‌పీసీఐ చెప్తుంది. 

 

ఇంటర్నేషనల్ కార్డ్ యూజర్లకు ఎన్‌పీసీఐ 40 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. రూపే కార్డ్స్ ద్వారా మినిమమ్ రూ.1,000 ఖర్చు చేస్తే క్యాష్ బ్యాక్ పొందొచ్చు.. ఓక ట్రాన్సాక్షన్ ద్వారా తక్కువలో తక్కువ రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందగలం. నెలకు నాలుగు ట్రాన్సాక్షన్లు చేస్తే 16వేల వరుకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. 

 

 ఈ రూపే కార్డు ద్వారా రూపే ఇంటర్నేషనల్ కార్డు కలిగిన వారు క్యాష్‌బ్యాక్ మాత్రమే కాదు ఫ్లైట్ టికెట్స్, హోటల్స్ బుక్ చేసుకుంటే కూడా ఇతర ఆఫర్లు లభిస్తాయి. చూశారుగా.. ఎన్ని లాభాలు ఉన్నాయో. ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ రూపే కార్డు తీసుకోండి ఎన్నో ఆఫర్లను పొందండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: