ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నిత్యం బ్యాంకు నుంచి డబ్బు తీస్తూ ఉంటాం. ఇంకా బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి అయితే బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి రోజు ముఖ్యమే. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

 

అయితో ఒక్కోసారి ఊహించని విధంగా బ్యాంకు సెలవలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ కస్టమర్లకు హాయ్ అలెర్ట్ ప్రకటించాల్సి వచ్చింది. బ్యాంకులు సమ్మె బాట పడుతున్నారు. బ్యాంక్ యూనియన్లు ఇప్పటికే ఈ విషయాన్ని బ్యాంకులను తెలియజేశాయి. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడబోతోంది. కేవలం బ్యాంక్ ఉద్యోగులు మాత్రమే కాకుండా వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు, వర్కర్లు కూడా ఈ భారత్ బంద్‌లో పాల్గొనబోతున్నారు. 

 

ఈ బ్యాంకు యూనియన్లు సమ్మె జనవరి 8న చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆరోజు బ్యాంకింగ్ సేవలు అన్ని ఆగిపోనున్నాయి. అలాగే ఏటీఎం సర్వీసులపై కూడా ఎక్కువ ప్రభావం పడచ్చు. అందుకే బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, దీనికి అనుగుణంగా బ్యాంక్ పనులు ప్లాన్ చేసుకోవడం ఎంతో మంచిది. అయితే ఈ సమ్మెకు కారణం మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను బ్యాంక్ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. అందుకే ఈ సమ్మెకు దిగుతున్నాయి. 

 

జనవరి 8 నాటి బ్యాంక్ స్ట్రైక్‌కు ఆరు యూనియన్లు మద్దతు ఇచ్చాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఐఎన్‌బీఈఎఫ్), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీఓసీ), బ్యాంక్ కర్మాచారి సేన మహసంఘ్ (బీకేఎస్‌ఎం) అనే ఆరు బ్యాంకు యూనియన్లు సమ్మెలో పాల్గొంటాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: