పెట్రోల్, డీజిల్ ధరలు మరి దారుణం అయిపోయాయి. రోజు రోజుకు భారీగా పెరుగుతూ పోతున్నాయి. ఒక రోజు ధరలు భారీగా పెరిగితే మరో రోజు తగ్గేది అని ముందు అనేవాళ్ళం కానీ ఇప్పుడు రెండు నెలలుగా పెరుగుతూనే ఉండటం తప్ప తగ్గటం లేదు. దీంతో నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 11 పైసలు పెరుగుదలతో ధర రూ.80.23 వద్దకు చేరగా, డీజిల్ ధర 16 పైసలు పెరుగుదలతో రూ.74.58కు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. 

 

ఇంకా వివిధ మెట్రో నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగే  కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 74.89 రూపాయిల దగ్గర, డీజిల్ ధర 73.63 రూపాయిల వద్ద కొనసాగుతుంది. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.03 శాతం తగ్గుదలతో 62.35 డాలర్లకు క్షీణించింది. 

 

అయితే గత రెండు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు 10, 15 పైసల్ పెరుగుదలతో 5 రూపాయిలు పెరిగింది. పైసలు రూపంలో పెరుగుదల వాహనదారులకు కనిపించడం లేదు కానీ నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కేవలం రెండు నెలలో 80 రూపాయిలు అయ్యింది. ఇలాగే ఉంటె ఇంకొక నెలలో లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయిలు అవుతుంది. 

 

అయితే ప్రస్తుతం గల్ఫ్ దేశాలపై యుద్ధమేఘాలు కమ్ముకున్నందువల్ల ఆ ప్రభావం మనపై పడనుంది. ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బాగ్దాద్ పై అమెరికా దాడి.. దాన్ని నిరసిస్తూ ఇరాన్ అమెరికాకు హెచ్చరిక పంపడం వంటి కారణాల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఘోరంగా పెరగనున్నాయి. మరి ఈ పెట్రల్, డీజిల్ దాడికి వాహనదారులు ఎం అవుతారో.. చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: