బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి . దిగిరావాలని సామాన్యులు ఎంతగా కోరుకుంటున్న దిగి వచ్చే పరిస్థితులు ఏమాత్రం కన్పించడం లేదు. అమెరికా , ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్త  పరిస్థితుల నేపధ్యం లో పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి . దీనితో దేశీయ మార్కెట్ లోను బంగారం ధరలు సామాన్యునికి ఏమాత్రం అందుబాటులో లేకుండా ఏకంగా 40 వేల రూపాయల మార్క్ చేరుకొంది . బంగారం ధర గత రెండు వారాలకాలం లో ఏకంగా రెండు వేల రూపాయలు పెరగడంతో , సామాన్యులు తామిక పసిడిని కొనుగోలు చేయగలమా? అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

 

 ఎంసీఎక్స్ మార్కెట్ లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర శుక్రవారం ఏకంగా రెండు శాతం పెరగడం తో , దీనితో పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 40130 రూపాయలకు చేరుకుంది . అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం పెరుగుదల గత ఐదేళ్లలో ఇదే గరిష్ఠస్థాయి అని నిపుణులు చెబుతున్నారు . అమెరికా , బాగ్దాగ్ విమానాశ్రయం పై దాడిచేసి సైనికాధికారని చంపడం వల్ల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలు పరుగు పెడుతున్నాయని చెప్పారు .

 

ఇన్వెస్టర్లు ఈక్విటీ వైపు కాకుండా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొంటున్నారు . బంగారం ధరల పెరుగుదల ఇక్కడితోనే నిలిచిపోయే అవకాశాలు ఎంతమాత్రం లేవని , భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలిపారు .  అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయ మారకం  విలువ పడిపోవడం కూడా ధరల పెరుగుదలకు మరొక కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు . ప్రస్తుతం శుభ కార్యాలు ఏవీ లేకపోవడం తో సామాన్యులు పెద్దగా బంగారం కొనుగోలు పట్ల ఆసక్తి ప్రదర్శించడం లేదని , అదే శుభ కార్యాల సీజన్ అయితే బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: