సన్నాసి.. సన్నాసి కొట్టుకుంటే బూడిద రాలినట్టు.. అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లను టెన్షన్ పెట్టింది. పెట్రోల్, డీజిల్, బంగారం ధరలు ఇప్పటికే పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లు డీలా పడిపోయాయి. అది దేశీయ మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు దేశీయంగా బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, లోహ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీలను కుదిపేస్తున్నాయి. 

 

ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. 300 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్‌.. అంతకంతకూ దిగజారింది. మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 700 పాయింట్లు పతనమై 40,764 వద్ద, నిఫ్టీ 210 పాయింట్లు పతనమై 12,016 వద్ద ట్రేడ్‌ అయ్యాయి. 

 

డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా 31 పాయింట్లు క్షీణించి 72.10గా కొనసాగింది. అయితే ఈ దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఈ అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం వల్ల అంతర్జితయంగా మార్కెట్లు ఘోరంగా నష్టపోయాయి. దీంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైన పడింది.

 

ఈ ప్రభావంతో సెనెక్స్ 788 పాయింట్ల నష్టంతో 40,676 వద్ద ముగిసింది.. ఇక నిఫ్ట్ 230 పాయింట్ల నష్టంతో 11995 వద్ద క్లోజ్ అయ్యింది. దీంతో ఇవాళ ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద దాదాపు 3 లక్షల కోట్లు అవిరి అయిపోయింది. ఇది ఈనాటి దేశీయ మార్కెట్ పరిస్థితి. ఇంకా బంగారం ధరలు అయితే ఆకాశాన్ని తాకుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: