సంవత్సరం ప్రారంభమైన రోజు నుండి పసిడి ప్రియులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎవరో చేసిన తప్పుకు ఇంకెవరో నష్ట పోయినట్టు.. ఎక్కడో జరిగే యుద్ధాల కారణంగా ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఇలా చెప్పడం అనాలోచితమే కానీ.. చెప్పక తప్పడం లేదు.. 

 

సరే ఇంకా అసలు విషయానికి వస్తే.. అమెరికా ఇటీవల న్యూ ఇయర్ మరుసటి రోజు బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్స్‌తో దాడి చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ దాడిలో ఇరాన్‌కు చెందిన కీలక సైనికాధికారి మరణించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా పరిగణించే బంగారంఫై ఇన్వెస్ట్ చేస్తున్నారు.. ధరలు భారీగా పెరుగుతున్నాయి. 

 

బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది. కాస్త కూడా సిగ్గు లేకుండా.. సామాన్యులకు చుక్కలు చూపిస్తూ పరుగులు పెడుతోంది. బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.50,000కు చేరొచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ నిపుణులు ఇదే అంశాన్ని పేర్కొంటున్నారు. 

 

హైదరాబాద్ మార్కెట్‌లో నేడు సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.390 పెరుగుదలతో రూ.38,320కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.390 పెరుగుదలతో రూ.41,770కు ఎగసింది. వెండి ధర కూడా కేజీకి రూ.200 పెరుగుదలతో రూ.49,600కు చేరింది... ఇలా రోజు రోజుకు పెరిగితే పరిస్థితి ఏంటి ? ఇక బంగారం కొనగలమా ?

మరింత సమాచారం తెలుసుకోండి: