యుద్ధ వాతావరణం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. మరి గత రెండు నెలలలో ఎందుకు పెరిగాయి? ఓకేసారి నాలుగు రూపాయిలు పెంచితే ప్రజలు ఆందోళన చేపడుతారని.. తెలివిగా రోజుకు 10 పైసలు.. 15 పైసలు పెంచుతూ రెండు నెలలలో ఐయుదు రూపాయిలు పెంచారు. ఇది ఏమైనా తెలుస్తుందా ప్రజలకు.. తెలియదు.. 100 రూపాయిలు పెట్రోల్ కొట్టు అంటారు.. ఎంత కొట్టారో కూడా తెలియదు.. పెట్రోల్, డీజిల్ ధర ఎంత పెరిగిందో కూడా తెలియదు. పరిస్థితి ఆలా అయిపోయింది మల్ల. సరే ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతో పెరిగాయో తెలుసా ? 

 

నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 15 పైసలు పెరుగుదలతో ధర రూ.80.76 వద్దకు చేరగా, డీజిల్ ధర 12 పైసలు పెరుగుదలతో రూ.75.29 కు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా వివిధ మెట్రో నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగే  కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 79.96 రూపాయిల దగ్గర, డీజిల్ ధర 74.63 రూపాయిల వద్ద కొనసాగుతుంది. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. 

 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.03 శాతం తగ్గుదలతో 62.35 డాలర్లకు క్షీణించింది. అయితే గత రెండు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు 10, 15 పైసల్ పెరుగుదలతో 5 రూపాయిలు పెరిగింది. ఇప్పుడు కేవలం రెండు నెలలో 80 రూపాయిలు అయ్యింది. ఇలాగే ఉంటె ఇంకొక నెలలో లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయిలు అవుతుంది. మరో నెల ఉంటె 100 రూపాయిలు అవుతుంది. మరి ఉంక పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి కానీ తగ్గవట. 

మరింత సమాచారం తెలుసుకోండి: