బ్యాంక్ కస్టమర్లకు గుడ్ కాదు కాదు డబల్ గుడ్ న్యూస్ ఇది.. మొబైల్ కారణంగా ఇప్పుడు బ్యాంక్ సర్వీసులు అన్ని చేతిలోకి వచ్చాయి.. అయితే ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ సర్వీసులు మరింత ఈజీ అయ్యాయి.. ఎలా అనుకుంటున్నారా ? అయితే ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

సాధారణంగా మనం నెట్ బ్యాంకింగ్ సర్వీసులు పొందాలంటే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తప్పనిసరిగా ఉండాలి. అవి ఎంటర్ చేస్తేనే ఈ సేవలు మనం పొందగలం. అయితే ఇప్పుడు పాస్‌వర్డ్ అవసరం లేకుండానే ఈ సేవలు పొందచ్చు.. ఎలా అనుకుంటున్నారా ? ఓటీపీతో సేవలను పొందవచ్చు.. 

 

ప్రైవేట్ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా నెట్ బ్యాంకింగ్ కోసం ఓటీపీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవలతో ఈ బ్యాంక్‌కు చెందిన కస్టమర్లు నెట్ బ్యాంకింగ్ లాగిన్ కోసం పాస్‌వర్డ్‌ అవసరం ఏమాత్రం లేదు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను.. ఆ నెంబర్ కు వచ్చే ఓటీపీ సాయంతో నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయ్యి సేవలను పొందొచ్చు. 

 

అయితే ఇక్కడ గుర్తు పెట్టొకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. నెట్ బ్యాంకింగ్ సర్వీసులకు పాస్‌వర్డ్ అవసరం లేకపోయినా..  డెబిట్ కార్డు పిన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.. లేకపోతే నెట్ బ్యాంకింగ్ సేవలను పొందలేము. చూశారుగా ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ సేవలను పొందండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: