డబ్బు ఈజీగా సంపాదించాలని అనుకుంటున్నారా ? కానీ మార్గం తెలియదా ? అయితే మీ కోసమే ఒక సూపర్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఆ సూపర్ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా ? అదేనండి బాబు.. మీ చేతిలో ఉన్న డబ్బుని ఎక్కడ అంటే అక్కడ ఇన్వెస్ట్ చెయ్యకుండా మంచి లాభాలు వచ్చే చోటా ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి లాభాలతో ముందుకు వెళ్ళచ్చు. అయితే ఆ మంచి మంచి ఆప్షన్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్.. ఇది గత మూడు సంవత్సరాలలో ఏడాదికి 17.7 శాతం లాభాన్ని అందిస్తుంది. ఇంకా వచ్చే మూడు సంవత్సరాల్లో కూడా ఈ ఫండ్ అదిరిపోయే లాభాన్ని అందినే అవకాశం ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ కి మంచి పేరు ఉన్నప్పటికీ మార్క్ట్ రిస్క్‌పై ఆధారపడి ఉంటాయనే విషయాన్ని గుర్తించుకొని ఇన్వెస్ట్ చెయ్యాలి.
ఓఎన్జీసీ షేరు.. 52 వారాల కనిష్ట స్థాయి వద్ద కదులుతుంది.. ఈ షేరుపై ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల మంచి లాభాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కంపెనీలో షేరు వ్యాల్యూయేషన్స్ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి.. రానున్న రోజుల్లో కంపెనీ గ్యాస్ మార్జిన్ బిజినెస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
మహీంద్రా ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఎంతో ఆకర్షణీయంగా వడ్డీని అందిస్తున్నాయి. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసేందుకు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే.. డిపాజిట్లపై 8.35 శాతం వరకు వడ్డీ ఇస్తుంది.. మనకు అవసరం అయితే వడ్డీ మొత్తాన్ని ప్రతి నెలా తీసుకోవచ్చు.
కెనరా రెబెకో రెగ్యులర్ గ్రోత్ ప్లాన్.. ఇది మల్టి క్యాప్ ఫండ్స్ లో మంచి అదిరిపోయే ఫండ్.. గత మూడు సంవత్సరాలలో ఏడాదికి రాబడి 15.52 శాతంగా ఉంది. అందుకే ఇది ఇన్వెస్ట్ చేసేకి మంచి ప్లేస్.