పెట్రోల్ డీజిల్ ధరలు.. ఏకంగా 16 పైసలు తగ్గింది.. డీజిల్ ధర ఆశ్చర్యకరంగా 27 పైసలు తగ్గింది. ఇలా గత రెండు వారాల నుండి తగ్గుతూ వస్తున్నాయి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు. అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత దారుణంగా పెరిగాయి అంటే 2 నెలల వ్యవధిలో దాదాపు 6 రూపాయిలు పెరిగింది. అయితే అలాంటి ఈ పెట్రోల్ డీజిల్ ధర భారీగా తగ్గుతూ వస్తుంది. 

 

అలాగే డీజిల్ ధర 66 రూపాయిలు ఉన్నది 75 రూపాయలకు చేరింది. అయితే ఇప్పుడు అవే పెట్రోల్, డీజిల్ ధరలు రెండు వారాల నుండి తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు సోమవారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 16 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 27 పైసలు తగ్గింది.  హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 16 పైసలు తగ్గుదలతో రూ. 78.38 కు చేరగా, డీజల్ ధర 27 పైసలు తగ్గుదలతో 72.74 రూపాయలకు చేరింది. 

 

ఇంకా విజయవాడలో, అమరావతిలో కూడా పెట్రోల్, డీజిలు ధరలు కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.  ఏది ఏమైనప్పటికి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.. ఇంకా ఇంకా ఇలానే తగ్గుతూ ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: