ప్రతి సంవత్సరం భారత దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే కేంద్ర బడ్జెట్ ఈసారి ప్రజలందరికీ షాక్ ఇవ్వబోతోందా? ప్రస్తుతానికి వెలువడుతున్న నివేదికలను మనం గమనిస్తే అందుకు సమాధానం కచ్చితంగా అవుననే వినిపిస్తోంది. ఈసారి బడ్జెట్ లో మోదీ సర్కారు ఏకంగా 50కిపైగా వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచాలని ఆలోచనలో ఉన్నారట. అదే కనుక జరిగితే సామాన్యుడి జీవితం దుర్భరం అవుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వస్తువులపై రేట్లు పెంచాలో ఒక నిర్ణయానికి వచ్చేసింది అని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతుండగా సుంకం పెంపు కూడా దాదాపు 5 నుంచి 10 శాతం వరకు ఉండొచ్చని వారు పేర్కొన్నారు.

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1 తేదీన ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లో సుంకాల పెంపునకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో పాటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అత్యవసరం కాని వాటిని తగ్గించడమే వారి లక్ష్యమని మంత్రిత్వశాఖ కూడా పేర్కొంది. దిగుమతి సుంకాల పెంపు వల్ల దేశ పరిశ్రమలకు ఊరట కలిగించాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

 

మోదీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి దిగుమతులపై పలు నియంత్రణలు తీసుకువచ్చారు. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ సహా ఇతర రంగాల్లో విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు పెంచడమే అసలు లక్ష్యం. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఒక కమిటీ 130 ప్రొడక్టులపై సుంకాలు పెంచాలని సిఫార్సు చేసింది.

 

కానీ తరువాత దాని సంఖ్యను 50 కు తగ్గించారు. ఇక పోతే మరీ ముఖ్యంగా మన జీవితంలో పరోక్ష భాగస్వామిగా తయారయిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మాత్రం భారీగా రేటు పెరిగే అవకాశం ఉంది.

 

మొబైల్ ఫోన్ చార్జర్స్, ఇండస్ట్రియల్ కెమికల్స్, ల్యాంప్స్, ఫర్నీచర్, క్యాండిల్స్, జువెలరీ, హ్యాండిక్రాఫ్ట్స్ సహా దాదాపు 50కి పైగా ప్రొడక్టులపై దిగుమతి సుంకాలు పెరిగే ఛాన్స్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో సంబంధింత కంపెనీలు, వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: